కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇక నిన్న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తమకోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు.


 అయితే ఈ మధ్యకాలంలో ఓటు వేసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఓటు వేయడం బాధ్యత అని తెలిసినప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లి అక్కడ లైన్ లో వెయిట్ చేసి ఏం ఓటు వేస్తాంలే అన్న విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకుల తీరు నచ్చక ఓటు హక్కు వినియోగించుకోవడానికి దూరంగానే ఉంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా చాలామంది ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో చాలా చోట్ల ఇక తక్కువ పోలింగ్ నమోదవడం చూస్తూ ఉంటాం.


 కానీ ఇక్కడ మాత్రం తక్కువ పోలింగ్ నమోదు అవ్వడం కాదు అసలు పోలింగ్ నమోదు కానే లేదు. నాగాలాండ్ లో ఒకే ఒక లోక్సభ స్థానానికి నిన్న పోలింగ్ జరిగింది. అయితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో 6 జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. దీంతో జీరో ఓటింగ్ నమోదయింది. నాగాలాండ్ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈ ఆరు జిల్లాల ప్రజలను ఓటింగ్ కి దూరంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చింది. దీంతో నాలుగు లక్షల ఓటర్లు ఉన్న ఈ జిల్లాలలో ఏ ఒక్కరు కూడా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో జీరో ఓటింగ్ నమోదు కావడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: