తెలుగు బుల్లితెరపై హైపర్ ఆది క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా జబర్దస్త్ లో తన కామెడీ పంచ్ డైలాగులతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హైపర్ ఆది అదే లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ క్రేజ్ తో సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నారు హైపర్ ఆది. ముఖ్యంగా మెగా కుటుంబానికి వీర అభిమానిని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే పలు సినిమాలను అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి.


ఇటీవల కాలంలో హైపర్ ఆది జబర్దస్త్ షో కి దూరమయ్యారు ప్రస్తుతం ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. బుల్లితెర పైన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుని కమెడియన్ గా కూడా పేరు సంపాదించారు. ప్రస్తుతం జనసేన పార్టీకి స్టార్ క్యాంపియన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. హైపర్ ఆది. ఇలా బిజీగా ఉన్నప్పటికీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది తన కెరియర్ లో జరిగిన విషయాలను జబర్దస్త్ ప్రోగ్రాం గురించి అనసూయ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


ముఖ్యంగా స్టార్ యాంకర్ అయినటువంటి అనసూయతో ఉన్న రిలేషన్ పైన ఓపెన్ అవుతూ వాళ్ళ విషయాలను తెలిపారు.. హైపర్ ఆది మాట్లాడుతూ జబర్దస్త్ లోకి రాకముందు తాను ఒక ఉద్యోగం చేసే వాడినని.. ఆ సమయంలో తన కుటుంబం మొత్తం అప్పులలో ఉందని.. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని.. ఆ సమయంలో తన తండ్రి తమకు ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మేసి అప్పులు కట్టేసారని తెలియజేశారు. ఆ తర్వాత కొంతమంది పరిచయస్తుల వల్ల జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాను అలా బాగా సక్సెస్ అయ్యానని తెలిపారు హైపర్ ఆది.


అనసూయ విషయం పైన హైపర్ ఆది మాట్లాడుతూ.. అనసూయతో తనకు మంచి రాపో ఉందని.. అందుకే అనసూయతో ఎక్కువగా స్కిట్లు చేసే వాడిని అంటూ అనసూయ కూడా తనని ప్రతిస్కెట్టుకు సపోర్ట్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుందంటూ తెలిపారు. తన స్కిట్ కు కావలసిన రియాక్షన్ కూడా అనసూయ ఇట్టే ఇచ్చేస్తుందంటూ వెల్లడించారు హైపర్ ఆది. ప్రస్తుతం అనసూయ పైన చేసిన హైపర్ ఆది కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. దీంతో పలువురు నెట్టిజెన్స్ ఈ విషయం పైన పాజిటివ్ నెగిటివ్ గానే కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: