గతంలో అనుకోకుండా కూటమిలో భాగంగా మహాసేన రాజేష్ టిడిపి అభ్యర్థిగా గన్నవరం టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆ సీటు నుంచి తప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అక్కడ టిడిపి నేతలు జనసేన నేతలు కూడా నానా హంగామా చేశారు.రాజకీయ చదరంగంలో పావుగా మారి ఆపైన పక్కకి వెళ్లిపోయారు మహాసేన రాజేష్.. మొన్నటివరకు ఈయన ఒక హీరో అయితే ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉన్నారు వాటి గురించి చూద్దాం.మహాసేన రాజేష్ లాంటి వారికి వ్యవస్థలు విలువ లేకుండా ఉందని.. ముఖ్యంగా కుల రాజకీయాలు చూసి చేస్తున్నారని విధంగా ఆరోపించారు. తనలాంటి వారికి సమాజంలో మాట లేకుండా చేశారని ఇలాంటి విషయాలతో తను చాలా బాధపడినట్టుగా తెలుస్తోంది. కానీ తన సామాజిక వర్గం కోసం చాలానే కష్టపడుతున్నారు. మహాసేన రాజేష్ తను ఏ విషయాన్ని అయినా సరే డైరెక్ట్ గానే చెబుతూ ఉంటారు.. అయితే మిగిలిన నేతలు మాత్రం కచ్చితంగా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ పరంగా అజెండా కోసమే పనిచేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు.


ఆలా అనూష ఉండవల్లి వంటి వారు ఇలాంటి విషయాల్లో బాగానే మెప్పు పొందారు. మొదట మహాసేన రాజేష్ కి గన్నవరం సీటు ఇచ్చినట్టే ఇచ్చి చాలా సుతిమేతంగా తీసేశారు.. మొదట బిజెపి పేరు చెప్పారు.. ఆ తర్వాత జనసేన పేరు చెప్పి తీసేసారు. మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ కోసం నియోజకవర్గాలు తిరుగుతానని చెప్పిన మహాసేన.. మాల సామాజిక వర్గం కోసం పాటుపడతానని చెప్పిన రాజేష్ ఇప్పుడు ఏమైపోయారు ఎక్కడున్నారు అనే విషయం అందరిలోనూ ప్రశ్నగా మారుతోంది. అంతేకాకుండా ఇప్పుడు ఎందుకు ప్రతి నియోజకవర్గంలో తిరగడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయం పైన అటు తెలుగుదేశం పార్టీ కానీ మహాసేన రాజేష్ కానీ ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: