బిజెపి పార్టీ అనుకున్నట్లుగానే మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది. కేవలం ఇన్నాళ్ల ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో జవహర్లాల్ నెహ్రూ కు మాత్రమే సాధ్యమైనా హ్యాట్రిక్ రికార్డుని.. ఇక ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా నమోదు చేసింది. అయితే బీజేపీ పార్టీకి గతంతో పోల్చి చూస్తే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది అన్న విషయం తెలిసిందే  అయితే ఇటీవల ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.


 ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిరథ మహారధులు హాజరయ్యారు అని చెప్పాలి. అయితే ఇక ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడమే కాదు.. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ కూడా చేశారు. అని రాష్ట్రాల నుంచి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచినవారు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు అనే విషయం తెలిసిందే. అయితే ఇలా ఎలాంటి అసంతృప్తి లేకుండా మంత్రివర్గ విస్తరణ అయితే బిజెపి పూర్తి చేయగలిగింది. కానీ ఇప్పుడు బీజేపీ పెద్దల ముందు ఒక అతిపెద్ద సవాలు ఉంది అని చెప్పాలి. అదే బిజెపి పార్టీకి జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడం.


 మొదటిసారి ప్రధాన మంత్రిగా మోడీ ఎన్నిక అయినప్పుడు బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగారు. కానీ ఆ తర్వాత అమిత్ షా ఆ బాధ్యతలనుంచి తప్పుకొని ఇక కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో జెపి నడ్డా చేతికి బిజెపి జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు వచ్చాయి. ఇక ఇప్పుడు జేపీని నడ్డా కూడా బిజెపి అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకుని మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు పదవి కోసం కొత్త వారిని వెతుక్కోవాల్సిన పని ఏర్పడింది. దీంతో ఈ పదవి ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: