ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం జరిగినటువంటి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రజినీకాంత్ ను బాలకృష్ణ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి అనేక విషయాలను మాట్లాడారు. ఈ సందర్భంగా  రజినీకాంత్ మాటలను మరోరకంగా అర్థం చేసుకున్నటువంటి వైసిపి నాయకులు రజినీకాంత్ ను టార్గెట్ చేసి విపరీతంగా విమర్శించారు. కొడాలి నాని, రోజా ఆయనను దారుణంగా తిట్టి పోశారు. షూటింగ్ గ్యాప్ ల్లో వచ్చే ప్యాకేజీ బ్యాచులు జగనన్న విమర్శించడమా, వారి బ్రతుకెంత అనే విధంగా మాట్లాడారు. 2019 నుంచి మొదలు రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ జరిగిన జగనన్నదే విజయమని, కనీసం అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందని వ్యక్తులు కూడా ఇక్కడకు వచ్చి విమర్శించడం విడ్డూరంగా ఉందని మాట్లాడారు.

 నిజానికి రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్ వచ్చి రజినీకాంత్ ను గాని జగన్ ప్రభుత్వాన్ని కానీ ఏ విధమైన విమర్శ చేయలేదట.రజినీకాంత్ మాటలను మరో రకంగా అర్థం చేసుకున్నటువంటి జగన్ బలగం అంతా ఆయనను తిట్టిపోసింది. దీంతో చెన్నైలో జరిగినటువంటి ఒక ఈవెంట్ లో వాటన్నిటికీ కౌంటర్ ఇచ్చారు రజినీకాంత్ .. మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరు లేదు. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా అంటూ జైలర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ మాటలు 2024 ఎలక్షన్స్ లో నిజమైనట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఆనాడు రజినీకాంత్ పై విమర్శలు చేసిన నోర్లన్నీ ఇప్పుడు మూసుకుపోయాయి.

ఆనాడు మొరిగిన కుక్కలన్నీ ఇప్పుడు పడుకున్నాయని టిడిపికి సంబంధించిన కొంతమంది నాయకులు అంటున్నారు. ఇలా టిడిపి నాయకులు ప్రస్తుతం ఈ మాటలు అనడానికి కారణం రజినీకాంత్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ తరుణంలో ఆయన గతంలో చేసిన మాటలన్నీ మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ రజినీకాంత్ కు అక్కడ మాట్లాడే అవకాశం ఇస్తే మాత్రం "అర్థమైందా రాజా" అనే డైలాగ్ తో రజినీకాంత్ మాట్లాడితే మాత్రం అది ఎవరికీ గుచ్చుకోవాలో వారికి తప్పకుండా గుచ్చుకుంటుందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి రజినీకాంత్ కు మాట్లాడే అవకాశం వస్తుందా రాదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: