ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ప్రస్తుతం వినిపిస్తున్న పేరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలంతా ఈ ఇద్దరు పేర్ల మీదనే చర్చించుకుంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం టిడిపి గాడిన పడింది అంటే దానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణే అని అంటున్నారు. అది బయట జనాలు అనడం కాదు టిడిపిలో ఉండేటువంటి నాయకులు కూడా అంటున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన స్టేటస్ తో ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అనే విధంగా ఓవైపు వైసీపీ పార్టీని పూర్తిస్థాయిలో ఓడించారు. మరోవైపు తన పార్టీని 100% స్ట్రైక్ రేటుతో ఈసీ  గుర్తించేలా చేసుకున్నారు. అలాగే దేశస్థాయిలో మోడీ అమిత్ షా కళ్లలో పడ్డాడు.  

ఈ విధంగా పవన్ కళ్యాణ్ మంచి ప్లానింగ్ తో  అనుకున్నది సాధించడమే కాకుండా మంత్రి పదవి కూడా  పొందగలుగుతున్నాడు అని చెప్పవచ్చు. ఇలాంటి పవన్ కళ్యాణ్  చాలా దూకుడు స్వభావం కలిగిన వాడనే ముద్ర రాజకీయలతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఉంది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే చాలా ఓపికతో, వినయంగా కనిపిస్తూ ఉన్నాడు. నిన్న స్టేజి పైన  చంద్రబాబు వచ్చి అతని చేయి పట్టుకొని ఆలింగనం చేసుకుని ఎంత గౌరవం ఇచ్చారో మనం చూసాం. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా ఎంతో వినయంగా ఆయనతో  ఉంటున్నారు. ఈ వినయాన్ని అతివినయం అనుకోవాలా లేదా ఇంకా ఏదైనా స్ట్రాటజీ అనుకోవాలా అస్సలు అర్థం కావడం లేదట.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే ఎక్కువ పేరును రాష్ట్రంలో పొందుతున్నారని చెప్పవచ్చు. ఇలాగే కొనసాగితే మాత్రం  రాబోవు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కీలకమైన లీడర్ గా ఎదిగే అవకాశం అయితే కనిపిస్తోంది.  ఆనాడు చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ హయాంలో ఏ విధంగా అయితే మెల్లి మెల్లిగా ఎదుగుతూ వచ్చారో, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా  ముందు ముందు భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంది. దానికోసమే చంద్రబాబు దగ్గర వినయంగా ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆ వినయం వల్ల ఆయనకు రాజకీయ అనుభవం రావడమే కాకుండా, ప్రజల్లో గౌరవం కూడా పెరుగుతుంది. తన పార్టీ కూడా బలపడుతుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బతో అనేక విజయాలు అందుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: