టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి 164 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని అతి పెద్ద విజయం సాధించాయి. ఈ విషయంలో వారి మేనిఫెస్టో కీలక పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూపర్‌ సిక్స్‌ పేరిట టీడీపీ రిలీజ్ చేసిన మినీ మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఈ మేనిఫెస్టో ప్రకారం టీడీపీ కూటమి మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తానని వాగ్దానం చేసింది, అలానే రూ.4 వేల పెన్షన్, ఏటా మూడు ఫ్రీ గ్యాస్‌ సిలిండర్లు, ఆడోళ్లకు బస్సు ఫ్రీ, రూ.6 వేల దివ్యాంగుల పెన్షన్, బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది.

18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, యువతకు ఐదేళ్లలో 20 లక్షల జాబ్స్, నిరుద్యోగులకు మంత్లీ రూ.3 వేల భృతి, రూ.15 వేలు, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు అందజేస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇంకా చాలానే ప్రామిస్ లుక్ చేశారు. ఈరోజుతో చంద్రబాబు పదవి కాలం మొదలైపోయింది ఎందుకంటే ఈ ఇవ్వాళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇచ్చిన హామీల్లో దేన్నుంచి మొదలు పెట్టనన్నారు? బస్సుల్లో ఫ్రీగా తిరగాలని ఆంధ్రప్రదేశ్ మహిళలు అప్పుడే ఉవ్విళ్లూరుతున్నారు. చంద్రబాబు చెప్పినట్లు (ఏప్రిల్ నుంచి వర్తించే) పెన్షన్ అందుకోవాలని వృద్ధులు, దివ్యాంగులు చూపెడుతున్నారు. ఆ లెక్కన చూసుకుంటే 7,000 వృద్ధాప్య పింఛన్ల జులై 1న అందాల్సి ఉంది. ఆ తర్వాత రెగ్యులర్ గా రూ. 4 వేలు అందుతాయి.పెన్షన్ బస్సు ఫ్రీ ఇవి రెండు కూడా కీలకమైన అని చెప్పుకోవచ్చు. చాలామంది ప్రజలకు మెయిల్ చేస్తాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి కూడా దాదాపు ప్రతి ఇంటికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చు.

ఏపీ సీఎం చంద్రబాబు పదుల సంఖ్యలో ప్రకటించి పథకాలలో అన్ని ఒకేసారి అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్ సహకరించదు. అదే సమయంలో పథకాల అమలు ఆలస్యమైతే ప్రజలు ఇబ్బందులు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇంటికి డబ్బులు తెచ్చి ఇచ్చే నేతను కాదనుకొని అనవసరంగా చంద్రబాబుకి ఓటు వేశామనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పథకాలను త్వరగా అమలు చేసే పనిపై  ఫోకస్ పెట్టాలి. అలా చేస్తే బాబుకు ఏపీలో తిరుగుండదని చెప్పవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు తన పాలనను ఏ పథకంతో మొదలుపెడతారనే చర్చ జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: