తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విజయమ్మ అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో కూటమికి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అలాగే టిడిపి కి కూడా ఒంటరి గానే ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయిలో సీట్లు వచ్చాయి. ఇకపోతే ఈ రోజు నాలుగవసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఈ రోజు అనగా జూన్ 12 వ తేదీన ఉదయం 11 గంటల 27 నిమిషాలకు జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార వేడుక కేసరపల్లి , ఐటి పార్క్ వద్ద గన్నవరం , కృష్ణా జిల్లాలో జరగబోతుంది. ఈ వేడుకకు భారత ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సి ఎస్ అబ్దుల్ నజీర్ గారు ,  భారత హోమ్ శాఖ మాత్యులు అమిత్ షా గారు ముఖ్య అతిథులుగా రానున్నారు.

ఇక విశిష్ట అతిథుల హోదాలో బి జె పి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురందేశ్వరి గారు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రానున్నారు. వీరితో పాటు మరి కొంత మంది ముఖ్య అతిథులు కూడా ఈ రోజు జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. ఇకపోతే ఈ రోజు జరగబోయే ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు తో పాటు మరి కొంత మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనితో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గం ఉండబోతుంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు ఈ సారి సీనియర్స్ కంటే కూడా యువతకు ఎక్కువ తన మంత్రివర్గం లో చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే చంద్రబాబు మంత్రివర్గం లో యువగలం సందడి భారీగా ఉండబోతున్నట్లు ఉంటుంది. అలాగే జనాలు కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వారు ఎక్కువ సంతోషించే అవకాశాలు ఉంటాయి. దానితో చంద్రబాబు యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: