రాష్ట్రంలో ఎన్నికల ముగిసిపోయాయి. టిడిపి కూటమి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో కేసరపల్లి ఐటి పార్కు వద్ద  ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, అమిత్ షా, చిరంజీవి, రజినీకాంత్ ఇలా ఎంతోమంది రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు,కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేలాదిమంది ప్రజలు  ప్రముఖుల మధ్య నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ చేతుల మీదుగా పూర్తి చేశారు. దీంతో సభా ప్రాంగణం అంతా కరతాల ధ్వనులతో, హర్షద్వారాలతో దద్దరిల్లిపోయింది. 

ఈ క్రమంలోనే చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ క్రమంలోనే పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సమయంలో  ఆయన భార్య చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా చాలా ఆనందంతో తన ఫోన్ ద్వారా  పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తిగా వీడియో తీస్తూ చాలా ఆనందంతో మురిసిపోతుంది. ఆ తర్వాత నారా లోకేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. ఇదే తరుణంలో నారా బ్రాహ్మణి కూడా  చాలా ఉత్సాహంగా చూస్తూ,  వారి యొక్క కుమారుడు దేవాన్ష్ ని ప్రజల వైపు చూస్తున్న సమయంలో అతని భుజాలపై తట్టి డాడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చూడు అంటోంది.  

ఇలా వారి భర్తలు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తుంటే, భార్యలు ఈ విధంగా ఆనందంతో ఉండడం  వార్తల్లో  హైలైట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇది చూసినటువంటి చాలామంది  భర్తలు మంత్రులవుతుంటే భార్యలు చాలా ఆనంద పడుతున్నారని, ముఖ్యంగా అన్నా లేజీనోవా భర్త పవన్ కళ్యాణ్ చూసి చాలా మురిసిపోతుందని  కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: