2019లో టిడిపి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి చంద్రబాబు కుటుంబానికి చాలా ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా టిడిపి పార్టీ కూడా చాలా ఇబ్బందులలో పడిపోయింది. నేతలను కూడా వైసిపి పార్టీ చాలా ఇబ్బందులు పెట్టింది.. ఇలాంటి తరుణంలో 2024లో కచ్చితంగా గెలవాలని పట్టుదలతో అటు కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు ముకుమ్మడిగా పోటీ చేయడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. అలాగే చాలా మంది టీడీపీ నేతలతో పాటు నందమూరి ,నారా కుటుంబ సభ్యులు కూడా ఈ వేదికకు హాజరయ్యారు.ప్రభుత్వ ఏర్పాటు వేదిక పైన ఒక కనువిందు అయిన సంఘటన ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. అదేమిటంటే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి నుదుటిపైన చాలా ఆత్మీయంగా ముద్దు పెట్టారు.. టిడిపి అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి పైన పలువురు వైసిపి నేతలు చాలా అభ్యంతరకాల వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఎన్నడు లేనిది భువనేశ్వరి స్వయంగా రంగంలోకి దిగి మరి తన భర్తకు ప్రచారం చేయడంతో అండగా నిలిచింది. ఇప్పుడు తాజాగా అలాంటివన్నీ గుర్తు చేసుకొని బాలయ్య ఎమోషనల్ గా ఇలా అయ్యారని తెలుస్తోంది.కూటమిలో భాగంగా జనసేన బిజెపి నేతలు కూడా భారీ విజయాలను అందుకున్నారు.వైసీపీ పార్టీకి ఘోరమైన ఓటమిని చూపించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తాను చెప్పిన పనులన్నిటిని కూడా చేసి తీరుతానని అలాగే రాజధాని అమరావతి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి చేస్తానని కూడా మాట ఇచ్చారు.. అలాగే యువతకు వృద్ధులకు ఉద్యోగస్తులకు మహిళలకు సైతం ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తానని తెలియజేశారు చంద్రబాబు.. వీటన్నిటిని కూడా దగ్గరుండి మరి చేసేలా చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇవ్వడంతో కూటమి భారీ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: