ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. నారా లోకేష్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచారు. వార్డు మెంబర్గా కూడా గెలవరని... నారా లోకేష్ ను చాలా ఇన్సల్ట్ చేశారు.  కానీ ఎక్కడ పడ్డాడో అక్కడే..నిలబడి... చంద్రబాబు వారసుడిగా, యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు నారా లోకేష్. 2019 సంవత్సరంలో... వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... ఇప్పటివరకు ఎక్కడ తగ్గకుండా... ప్రజల కోసం అలాగే పార్టీ కోసం మాత్రమే పని చేశారు.


ఎన్ని అవమానాలు, ఆటంకాలు ఎదురైనా సరే... నారా లోకేష్ ఎక్కడ తగ్గలేదు. యువ గళం పేరుతో  పాదయాత్ర నిర్వహించి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతను తన వైపునకు లాక్కున్నారు నారా లోకేష్.  దీంతో తెలుగుదేశం పార్టీకి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు నారా లోకేష్...పాదయాత్ర నిర్వహించారు.

 

 నారా లోకేష్ పాదయాత్ర చేపట్టిన రోజే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించారు. దీంతో నారా లోకేష్ పై చాలా దృష్ప ప్రచారం చేసింది వైసిపి. కానీ వాటన్నిటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు నారా లోకేష్. నిత్యం జనాల్లో ఉంటూ... పార్టీని కాపాడే ప్రయత్నం చేసుకున్నారు. అదే సమయంలో... తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో... పకడ్బందీగా పార్టీని పటిష్టం చేయగలిగారు.

 

చంద్రబాబు వారసుడిగా కాకుండా... నారా లోకేష్ గా జనాలకు పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నియోజకవర్గంలో చాలా సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండాను ఎగరవేశారు నారా లోకేష్. దాదాపు 91 వేల మెజారిటీతో... వైసిపి పార్టీపై విజయం సాధించారు  లోకేష్. ఇక ఇప్పుడు ఏపీలో... కీలక మంత్రిత్వ శాఖ కూడా తీసుకోబోతున్నారు లోకేష్.  గతంలో ఐటీ శాఖ అలాగే పంచాయతీ శాఖ బాధ్యతలు స్వీకరించి ఏపీని చాలా అభివృద్ధి చేశారు. ఈసారి కూడా ఆ రెండు పదవులు నారా లోకేష్ కు వస్తాయని అందరూ అంటున్నారు. ఆ రెండు పదులు తీసుకొని ఏపీని మరింత డెవలప్ చేయాలని నారా లోకేష్ ను కోరుతున్నారు ఏపీ ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: