ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్  ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారిద్దరి అనంతరం మరో 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
 

 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, కాబోయే మంత్రి టీజీ భరత్...  కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిత్రులందరికీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే... టీజీ భరత్ మాత్రం ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేసి... చరిత్ర సృష్టించాడు. తన ప్రమాణ స్వీకారం లో... తడబాటు లేకుండా  స్పష్టంగా ప్రమాణస్వీకారం చేశారు భరత్. టీజీ భరత్ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే... ఆయన సామాజిక వర్గం వైశ్య. వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే నేపథ్యంలో... యంగ్ లీడర్ టీజీ భరత్ కు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా నారా లోకేష్ టీమ్లో... టీజీ భరత్ కూడా ఉన్నాడు.  వైశ్య సామాజిక వర్గ కోటాలో... టీజీ భరత్ కు మంత్రి పదవి వస్తుందని అందరూ ప్రచారం చేశారు.  దానికి తగ్గట్టుగానే టీజీ భరత్ కు అవకాశం కలిసి వచ్చింది. అయితే ఆయన తండ్రి టీజీ వెంకటేష్ బిజెపి పార్టీలో చేరినప్పటికీ...  కర్నూలు నియోజకవర్గంలో పార్టీ కోసం చాలా కష్టపడ్డారు భరత్.

 

 తన తండ్రి టీజీ వెంకటేష్ మరో పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డారు  టీజీ భరత్. అంతేకాకుండా సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా... నారా లోకేష్ కు తోడుగా నిలిచారు. నారా లోకేష్ కు సంబంధించిన టీం లో... టీజీ భరత్ కీలకమైన వ్యక్తి. యూత్ ను పార్టీ వైపు... తీసుకువచ్చే క్రమంలో టీజీ భరత్ చాలా కష్టపడ్డారు. యూత్ ను  పార్టీ వైపు లాగి... విజయం కోసం చాలా కృషి చేశారు టీజీ భరత్. ఈ అన్ని  అంశాల నేపథ్యంలో టీజీ భరత్ కు మంత్రి పదవి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: