ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఈనెల నాలుగవ తేదీన విడుదలయ్యాయి. ఇందులో కూటమిలో భాగంగా టిడిపి ,జనసేన, బిజెపి పార్టీలో 164 స్థానాలలో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారానికి మోదీ, చిరంజీవి, రజనీకాంత్, అమిత్ షా, పవన్ కళ్యాణ్, తదితర నేతలు  సెలబ్రిటీలు సైతం రావడమే కాకుండా మెగా కుటుంబ సభ్యులు నందమూరి నారా కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సభా ప్రాంగణంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది.


అదేమిటంటే ఒకే ప్రేమలో చిరంజీవి మోదీ పవన్ కళ్యాణ్ చూడడంతో అభిమానులు సైతం చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మోడీతో కలిసి చేతులు పైకెత్తి మరి తన తమ్ముడిని పొగిడినట్లుగా కనిపిస్తోంది చిరంజీవి. ముఖ్యంగా  పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఎక్కడ గెలిచింది లేదు.అయితే ఈసారి కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు రెండు పార్లమెంటు స్థానాలను గెలిచి మంచి పాపులారిటీ సంపాదించారు.అయితే చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆనంద భాష్పాలు చాలా క్లియర్ గా కనిపించాయి.. చాలామంది టీడీపీ కార్యకర్తలు బిజెపి జనసేన కార్యకర్తలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వేడుకకు సైతం చిరంజీవి తన కుటుంబంతో పాటు రజనీకాంత్ కూడా తన భార్య తో రావడం జరిగింది.. మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా హైలెట్గా నిలిచారు.. ముఖ్యంగా అఖీరా పంచకట్టుతో ఇక్కడ హైలెట్గా నిలిచారు.సీఎంతో కలిపి 25 మంది క్యాబినెట్ల ప్రమాణస్వీకారం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి పవన్ కళ్యాణ్ మోదీకి సంబంధించి ఈ విషయం మాత్రం చాలా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: