ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. తాజాగా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త‌ర్వాత టీడీపీ యువ నాయ‌కుడు , పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌, త‌ర్వాత‌..పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు త‌ర్వాత కొల్లు ర‌వీంద్ర‌.. ఇలా వ‌రుస‌గా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అయితే.. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నుంచి మంత్రులు అంద‌రూ రెండు ప్ర‌మాణాలు చేశారు.


వాస్త‌వానికి ఎక్క‌డైనా ఇలానే రెండు సార్లు ప్ర‌మాణాలు చేస్తారు. కానీ, వీటి మ‌ధ్య భేదం ఉంటుంది. ఒక‌టి ప‌ద‌వికి సంబంధించింది. ఉదాహ‌ర‌ణ‌కు.. `నారా  చంద్ర‌బాబు నాయుడు అనే నేను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నాను` అని చెప్ప‌డం. ఇది కేవలం ప‌ద‌వికి సంబంధించిన ప్ర‌మాణం. త‌మ పేరును పేర్కొంటూ.. చేసే ప్ర‌మాణం. దీనిలో దైవ‌సాక్షి లేదా ఆత్మ సాక్షి అనే ప‌దాలు జోడించ‌రు. కేవ‌లం నేను  ముఖ్య‌మంత్రి, లేదా మంత్రిగా ప్ర‌మాణం చేస్తున్నా అని మాత్రమే చెబుతారు.


కానీ, దైవ సాక్షి అనే ప‌దం విష‌యానికి వ‌స్తే.. ఇది రెండో ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించిన ఘ‌ట్టం. ఈ విష‌యంలో కీల‌క‌మైన అంశాన్ని పేర్కొంటారు. తాము చేప‌ట్టే ప‌ద‌వికి సంబంధించిన ప్ర‌మాణం అనం త‌రం.. ఆ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఎద‌ర‌య్యే సంక్లిష్ట స‌మ‌స్య‌లు, ఇత‌ర‌త్రా ఎదుర‌య్యే ఇబ్బందులు.. అత్యంత ర‌హ‌స్యాలు, ప్ర‌భుత్వ ప‌ర‌మైన అంశాల‌ను ఎవ‌రికీ చెప్ప‌బోమ‌న్న‌ది ఈ ప్ర‌మాణం. ఇది నాయ‌కుల‌కు కీల‌క‌మైన వ్య‌వ‌హారం. ఈ సంద‌ర్భంగానే ఎవ‌రికి ఇష్టానుసారం వారు ఆత్మ , దైవ సాక్షి అంటూ ప్ర‌మాణం చేస్తారు.


తొలి ఆహారం ఇదే...

మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రులు, మంత్రుల‌కు రాజ్‌భ‌వ‌న్ భారీ ఎత్తున విందు ఇస్తుంది. దీనిలో తొలిగా స్వీట్‌(బెల్లం లేదా పంచ‌దార‌) క‌లిపి వాట‌ర్‌ను ముందు ఇస్తారు. త‌ర్వాత‌.. ఇత‌ర ప‌దార్థాలు వ‌డ్డిస్తారు. విజ‌యానికి శుభాకాంక్ష‌లు తెలుపుతు ఇచ్చే ఈ విందుకు ప్రాధాన్యం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: