గతంలో కొన్ని చిత్రాలలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నటి శ్రీరెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మెగా కుటుంబం పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. గతంలో ఫిలిమ్ చాంబర్ ముందు ఆర్థ నగ్నంగా బయటాయించి ఒక సంచలనంగా మారింది శ్రీరెడ్డి.


ఆ తర్వాత సోషల్ మీడియాలో పలు రకాల వంటలకు సంబంధించి తెలియజేస్తూ  మరింత క్రేజీ అందుకుంది. సోషల్ మీడియాలో నిత్యం ఎవరో ఒకరిని ఏకీపారేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. వైయస్ జగన్ ను ఎవరైనా ఏమైనా అన్నారంటే వెంటనే స్పందిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి.. 2024 ఎన్నికలలో వైసిపి చాలా ఘోరంగా ఓడిపోయింది. అందుకు కారణం వైసీపీ నేతలే ఓటమికి కారణమని చాలామంది నేతలను కూడా తిట్టిపోస్తోంది శ్రీరెడ్డి. తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం మరొక అంశం ఉందంటూ ట్విట్ చేసింది.. ఐ ప్యాక్ కి ఇచ్చిన 400 కోట్ల రూపాయలలో కనీసం 50 కోట్లు కార్యకర్తలకు ఖర్చుపెట్టిన విజయం నీదే స్వామి..టిడిపి అధికారంలో ఉంటే జన్మభూమి కమిటీల ద్వారా ఇతర రూపాలలో కార్యకర్తలు బాగా దండుకునేవారు అధికారం లేకపోయినా సోషల్ మీడియా కార్యకర్తలను పోషించింది టిడిపి అంటూ తెలిపింది.


నువ్వు బటన్లు నొక్కుతూ ఉన్నావు కానీ కార్యకర్తలు ఎండిపోయారు.. ఇప్పటికైనా నీ సోషల్ మీడియాని కార్యకర్తలని దగ్గరికి చేర్చుకో అంటూ తెలిపింది. ముఖ్యంగా మహాసేన రాజేష్ గాడు ,గాయత్రి ,అనూష వంటి పిల్ల పిత్రేయలు కూడా చంద్రబాబు స్టేజి మీద పక్కన నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు.. వారికి కావలసిన హెల్ప్ కూడా చేస్తూ ఉన్నారని మన సోషల్ మీడియా కార్యకర్తలకి వేల్యూ యు స్వామి అంటే ఒక ట్విట్ ను షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: