ఈరోజు జరిగిన చంద్రబాబు ప్రమాణస్వీకారంతో ఏపీలో కొత్త మంత్రులు ఎవరో తెలిసిపోయింది.అయితే వారి శాఖలు కేటాయింపులు జరగలేదు కానీ మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేసేసింది. ఒకట్రెండు రోజుల్లో శాఖల విషయంలో ఓ స్పష్టత వస్తుంది.చంద్రబాబు కాబినెట్లో ఈసారి కొత్తవాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.కొత్త, పాత కలయికతో కూర్పు అద్భుతంగా కుదిరిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.కాకపోతే చంద్రబాబు బావమరిది, హిందూపూర్ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు మాత్రం కాబినెట్లో చోటు దక్కలేదు.దానికి ఆయన అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి, హ్యాట్రిక్ సాధించారు బాలకృష్ణ. 2019 లో వైకాపా గాలి వీచినప్పుడు సైతం హిందూపురంలో బాలయ్య విజయాన్ని ఆపలేకపోయారు.

 ఈసారి హిందూపురంలో బాలయ్యని ఓడించడానికి వైకాపా గట్టి ప్రయత్నాలే చేసింది.ఈసారి గెలుపుతో ఇంకా హిందూపురంలో తనకు తిరుగులేదని బాలయ్య మరోసారి నిరూపించుకొన్నారు.అయితే ఈ గెలుపుతో ఈసారి నందమూరి బాలయ్యకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఎంతో ఎదురుచూసిన అభిమానులకి నిరాశ మిగిలింది.ఆయనకు సినిమాటోగ్రఫీ మంత్రిగా చూస్తామని ఆశించారు అభిమానులు. కానీ బాలయ్యకు లిస్టులో స్థానం దక్కలేదు. త్వరలో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా, విస్తరిస్తే అప్పుడు బాలయ్య పేరు ఉంటుందా? అంటూ ఇప్పుడే అభిమానులు ఆరా తీస్తున్నారు. నిజానికి మంత్రి పదవిని బాలయ్యే సున్నితంగా తిరస్కరించినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.

బాలకృష్ణ సినిమాల విషయంలో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇదివరకటి కంటే స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. పైగా బసవతారకం బాధ్యతలు ఆయన నెత్తిమీద ఉన్నాయి పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు కొన్ని శాఖలు కేటాయించాల్సిన అవసరం ఉందని .దాంట్లో భాగంగానే బాలయ్య స్వయంగా ఈ రేసునుంచి తప్పుకొన్నారని తెలుస్తోంది.ఒకవేళ ఇవన్నీ కాదని ఇచ్చిన కూడా తన కుటుంబంలో వారికీ చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినట్లుంటదని బాలయ్య తనకుతానే మంత్రి పదవి రిజెక్ట్ చేసారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: