ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పిఠాపురం ఎన్నికలు ఈసారి హాట్ టాపిక్ గా మారాయి.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని చెప్పడం చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటాను అంటూ తెలిపారు.. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గెలవడంతో తన పేరుని సైతం మార్చుకునేలా పలు రకాల పేపర్లతో సిద్ధమయ్యారని తెలియజేశారు. మరో కొద్ది రోజులలో అందుకు సంబంధించి పేపర్లను కూడా తెలియజేస్తానని ముద్రగడ వెల్లడించారు అయితే ఇప్పుడు తాజాగా ఒక షాక్ ముద్రగడకు తగిలినట్లు తెలుస్తోంది.అలాగే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చమని చెప్పి డిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నానని ఇలా పేరు మార్పు ప్రయత్నాలలో ఉన్న ముద్రగడ.. తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకునేందుకు సైతం.. సిద్ధమైన ముద్రగడకు కౌంటర్లు వేశారు.. అనపర్తి మండలంలో మాజీ సర్పంచ్ కర్రీ వెంకట రామారెడ్డి.. కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులకు ఒక విజ్ఞప్తిని చేస్తూ లేఖ ను కూడా విడుదల చేశారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడిన వ్యక్తులు రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవలసిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు.ముఖ్యంగా ఆయన జన్మించిన కులానికి అప్పకీర్తి తెచ్చి.. తమ రెడ్డి కులంలో కలవడానికి ఆయనకు ఎవరు అనుమతిచ్చారని.. ముద్రగడ పద్మనాభం గారు.. మా రెడ్డి కులంలో చేరవద్దు అంటూ మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి విన్నవించుకున్నారు. అలాగే ఎవరైనా చేరడానికి అనుమతి ఇచ్చి ఉంటే చేరవచ్చు అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఒకవేళ తమ కులం పైన అంత గౌరవం ఉంటే కచ్చితంగా ముద్రగడ పద్మనాభం కారు తమ కులంలోనే ఉంటారు అంటూ కూడా ఆయన వెల్లడించారు అందుకు సంబంధించి ఒక లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: