- ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఓట‌మి లేకుండా ఐదోసారి విక్ట‌రీ
- 2016 లోనే మంత్రిని చేస్తాన‌ని మాటిచ్చిన బాబు
- ముక్కుసూటి.. గట్స్ ఉన్న క్రేజీ లీడ‌ర్ బుజ్జి

( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )

మినిస్ట‌ర్ గొట్టిపాటి ర‌వికుమార్‌... ఈ ప‌ద‌వి ఊరికే రాలేదు... 25 ఏళ్ల క‌ఠోర క‌ష్టం.. ఓట‌మి లేని ధీరుడు.. పార్టీల‌తో సంబంధం లేని క్రేజున్నోడు... అస‌లు ర‌వికి చంద్ర‌బాబు ఏ వ్యూహంతో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు... ఏంట‌న్న‌ది లోతుగా ప‌రిశీలిస్తే చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలే క‌నిపిస్తాయి. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు తిరుగులేని యోధుడుగా ఉన్న దివంగ‌త గొట్టిపాటి హ‌నుమంత‌రావు రాజ‌కీయ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ర‌వి ఓట‌మి లేకుండా ఐదుసార్లు వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చారు. మార్టూరులో ఒక‌సారి.. అద్దంకిలో నాలుగుసార్లు... కాంగ్రెస్ నుంచి రెండుసార్లు.. వైసీపీ నుంచి ఒక‌సారి.. టీడీపీ నుంచి రెండుసార్లు ర‌వి గెలుస్తూ వ‌స్తున్నారు.


ర‌వికి చాలా రికార్డులే ఉన్నాయి. జ‌గ‌న్ పార్టీలో గెలిచి బ‌య‌ట‌కు వ‌చ్చి 2019లో గెలిచిన ఏకైక నేత‌. అందుకే గ‌త ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వంలో ర‌వి గ్రానైట్ వ్యాపారాల‌పై దాడులు చేయించి.. కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చినా.. పార్టీ మారాల‌ని బెదిరింపుల‌ను సైతం లెక్క చేయ‌కుండా పార్టీ కోసం నిల‌బ‌డ్డారు. అద్దంకిని పార్టీకి కంచుకోట‌ను చేయ‌డంతో పాటు ఈ ఎన్నిక‌ల్లో ద‌ర్శిలోనూ త‌న అన్న కుమార్తె ల‌క్ష్మికి సీటు ఇప్పించుకున్నారు. జిల్లాలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌కు గ‌త నాలుగేళ్ల నుంచి ఆర్థిక స‌హాయ స‌హ‌కారాలు అందించారు.


ఈ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌కాశం జిల్లాలో కొంద‌రు పార్టీ అభ్య‌ర్థుల‌కు భారీగా సాయం చేశారు. గుండె నిండా ద‌మ్మున్న లీడ‌ర్‌గా ర‌వి ఎదిగారు. ఏ విష‌యంలో అయినా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా సూటిగా మాట్లాడ‌తారు.. పార్టీకి ఇలాంటి లీడ‌ర్లు కొన్నేళ్ల పాటు ఉండాల‌న్నంత‌గా ర‌వి పేరు రాష్ట్ర స్తాయిలో మార్మోగింది. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత అయినా కూడా అన్నీ కులాల్లోనూ రాష్ట్ర స్థాయిలో ప్ర‌భావితం చేసే గట్స్ ఉన్న లీడ‌ర్‌గా గుర్తింపు ఉండ‌డం ఇవ‌న్నీ బాబును బాగా ఆక‌ర్షించాయి.


దీనికి తోడు 2014 లో ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక అప్పుడే చంద్ర‌బాబు పార్టీ మారితే ర‌విని మంత్రిని చేస్తాన‌ని హామీ ఇచ్చార‌న్న టాక్ న‌డిచింది. అప్పుడు కమ్మ కోటాలో ఎక్కువ మంది ఉండ‌డంతో స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి రాలేదు. ఆ మాట బాబు ఇప్పుడు నిల‌బెట్టుకున్న‌ట్లైంది. ఇక ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా నుంచి దామ‌చ‌ర్ల ఆంజ‌నేయులు త‌ర్వాత క‌మ్మ సామాజిక వ‌ర్గం నుంచి మంత్రి అయిన వ్య‌క్తిగా ర‌వి రికార్డుల్లో నిలిచారు. జిల్లాలో అటు కొండ‌పి ఎమ్మెల్యే స్వామికి ఎస్సీ - మాల కోటాలో.. ఇటు ర‌వికి ఓసీ క‌మ్మ కోటాలో మంత్రి ప‌ద‌వులు బ్యాలెన్స్ అయ్యాయి. ఏదేమైనా ర‌విపై ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి వాటిని ఎలా రీచ్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: