- ప‌వ‌న్‌, లోకేష్‌, నాదెండ్ల‌, గొట్టిపాటి, భ‌ర‌త్ మినహా కామ‌న్ పీపుల్‌కే కేబినెట్ ఛాన్స్‌
- సౌమ్యులు, నాన్ కాంట్ర‌వ‌ర్సీ ప‌ర్స‌న్ల‌నే తీసుకున్న బాబు
- 17 మంది అప్ప‌టిక‌ప్పుడు పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చినోళ్లే..!

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

గంగిగోవు పాలు.. అన్న‌ట్టుగా ఏపీలో చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో ఉన్న అంద‌రూ.. కూడా విన‌య‌శీలురు, విద్యావంతులు కావ డం గ‌మ‌నార్హం. పైగా.. వివాద ర‌హితులుగానూ పేరు తెచ్చుకున్నారు. ఎవ‌రిపైనా వివాదాలు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఒక‌రిద్ద‌రిపై కేసులు ఉన్నా.. అవి వ్యాపారాల‌కు సంబంధించిన విష‌యాలే త‌ప్ప‌.. సామాజికంగా మాత్రం కాక‌పోవ‌డం మ‌రింత విశేషం. ఉన్న వారిలో అంద‌రూ కూడా ఉన్న‌త విద్యావంతులే. మ‌హిళా మంత్రులు ముగ్గురూ కూడా.. ఉన్న‌త‌స్థాయి నేప‌థ్యం నుంచి వ‌చ్చిన వారే కావ‌డం మ‌రింత క‌లిసి వ‌చ్చే అంశం.


ఆస్తుల విష‌యంగా చూసుకున్నా ప‌వ‌న్‌, చంద్ర‌బాబు, నారా లోకేష్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్, గొట్టిపాటి ర‌వి కుమార్‌, టీజీ భ‌ర‌త్‌ వంటి ఓ నలుగు రైదుగురు మిన‌హా అంద‌రూ ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితాల‌ను కొన‌సాగిస్తున్న‌వారే. పైగా మ‌ధ్య త‌ర‌గ‌తి క‌ష్టాలు.. క‌న్నీళ్లు తెలిసి న వారే కావ‌డం మ‌రింత విశేషం. నిజానికి  తొలిసారి మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన 17 మందిలోనూ అప్పటిక‌ప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు ఎవ‌రూ లేరు. క‌నీసంలో క‌నీసం ప్ర‌తి ఒక్క‌రికీ ప‌దేళ్ల అనుభ‌వం ఉంది. పైగా అంద‌రూ ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న నాయ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం. పేరు పేరునా నాయ‌కుల‌కు ఏదో ఒక ఉద్య‌మంతో సంబంధం ఉంది.


స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎలుగెత్తిన చ‌రిత్ర‌ను కూడా సొంతం చేసుకున్నారు. గుమ్మ‌డి సంధ్యారాణి నుంచి వంగ‌ల‌పూడి అనిత వ‌ర‌కు.. స‌మ‌స్య‌ల‌పై పోరాట నేప‌థ్యం ఉన్న‌వారే. ఇక‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వంటి ఒక సామాన్య కార్య‌క‌ర్త నుంచి ఎదిగిన నాయకుడికి మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌డం అంటే.. అసామాన్య విష‌యం. ఆయ‌న ఇప్ప‌టికీ.. త‌న మోటారు బైకుపై ప‌ర్య‌ట‌న‌లు చేస్తుంటారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇక‌, జ‌న నాయ‌కుడిగా గొట్టిపాటికి పేరున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, జ‌న‌సేన నుంచి తీసుకున్న ముగ్గురు కూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌, ప్ర‌జ‌ల‌తో ఉన్న నాయ‌కులే. బీజేపీ నుంచి వ‌చ్చిన స‌త్య‌కుమా ర్‌కు ప్రాంతీయ స్థాయిపై ప‌ట్టుంది. పైగా.. సీమ స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఓ పుస్త‌క‌మే రాశారు.


అంటే.. ఈయ‌న‌కు సీమ‌పై ఎంత‌టి అవ‌గాహ‌న ఉందో తెలుస్తుంది. ఎలా చూసుకున్నా స‌త్య‌కుమార్ నియామ‌కం.. సీమ‌కుమేలు చేసేదే. నెల్లూరు స‌మ‌స్య‌లపై ఎరుక ఉన్న నాయ‌కుడిగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికిపేరుంది. హుందాత‌నం ఉట్టిప‌డే వివాద ర‌హిత నేత‌గా, సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌గా ఆయ‌నకు ఫాలోయింగ్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి.. ప్ర‌జ‌ల‌నాడి తెలిసిన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న సౌమ్యుడు. నోటి దురుసు. నాలుక మ‌డ‌త‌లు తెలియ‌ని నాయ‌కులే కాదు.. సౌమ్యులు-వివాద ర‌హితులు కావ‌డంతో చంద్ర‌బాబుకు ఈ టీం క‌లిసి రానున్న‌ద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: