ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నాయకులలో కొలుసు పార్థసారథి ఒకరు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది మంత్రి గా పని చేశారు. ఈయన మంత్రి అయినప్పటికీ చాలా సాదాసీదాగా ఉంటూ ఎలాంటి హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఒక సాధారణమైన వ్యక్తుల జీవిస్తాడు అనే పేరు ఇతనికి ఉంది.

అలాగే చేసిన ప్రతి చిన్న పనిని పబ్లిసిటీ చేసుకోకుండా ఉంటూ రావడంతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. పార్థసారథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసిపి పార్టీలోకి వచ్చారు. ఆ పార్టీలో కూడా ఈయన కీలకమైన వ్యక్తిగానే కాలాన్ని గడిపారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఆ ఎన్నికలలో భాగంగా వైసిపి పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ను ఈయన ఆశించారు. కానీ ఆయనకు అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం. అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం అంటూ కాలయాపన చేసి చివరికి ఈయనకు టికెట్ ఇవ్వలేదు. దానితో ఈయన తెలుగు దేశం పార్టీలోకి వెళ్లారు. తెలుగు దేశం పార్టీ నుండి ఈయనకు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీటు దక్కింది. దానితో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నూజివీడు ప్రాంతం నుండి బరిలోకి దిగిన ఈయన తన సమీప అభ్యర్థి అయినటువంటి వైసీపీ పార్టీ నేత మేక వెంకట ప్రతాప్ అప్పారావు పై విజయం సాధించారు.

దీనితో ఈయనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అంటే ఆంధ్ర రాజకీయాలలో కీలక నేత కావడం, ఇప్పటికే కాంగ్రెస్ హయాంలో మంత్రి గా పని చేసి ఉండడంతో ఇలాంటి సౌమ్యుడికి, సీనియర్ కు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇంత గొప్ప వ్యక్తిత్వం కల వ్యక్తిని జగన్ అనవసరంగా దూరం చేసుకున్నాడు అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: