ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నడూ లేని విధంగా ఎన్డియే కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. నిన్న విజయవాడలోని కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు.. అలాగే ఆయనతో పాటు నూతన మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సారి ఎన్నడూ లేనివిధంగా మంత్రి వర్గంను ఏర్పాటు చేసారు.ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఏకంగా ఇద్దరి ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు, ఆ తర్వా త అటు కేంద్రంలోకానీ అలాగే రాష్ట్రంలో కానీ జిల్లా నుంచి 20 మంది మంత్రులుగా పనిచేశారు.. గత వైసీపీ ప్రభుత్వంలో మరోసారి బాలినేనితోపాటు ఆదిమూలపు సురేష్‌ మంత్రులుగా పనిచేశారు. ఈ మొత్తం సమయంలో మూడేళ్లపాటు మాత్రమే బాలినేని, సురేష్‌ ఇద్దరూ కూడా ఒకేసారి మంత్రులుగా ఉండగా చివరి రెండేళ్లు మాత్రం ఆదిమూలపు సురేష్‌ ఒక్కరే కొనసాగారు. టీడీపీకి గతంలో ఎప్పుడూ ఇంతటి ఘనవిజయం జిల్లాలో లభించ లేదు. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జిల్లాలోని ప్రాంతాలతో సంబంధం ఉన్న అన్ని పార్లమెంట్‌ స్థానాలను కూడా టీడీపీ గెలుచుకుంది. వైసీపీ కంచుకోట లాంటి పశ్చిమప్రాంతలో కూడా టీడీపీ మూడు స్థానాలను గెలుచుకుంది.

రెండు చోట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయింది..ఇంతటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇచ్చి అరుదైన అవకాశం కల్పిచారని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం తనదైన శైలిలో ఇద్దరిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు..గొట్టిపాటి రవికుమార్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి మార్టూరు నుంచి ఎన్నికైన ఆయన అద్దంకి నుంచి నాల్గోసారి గెలుపొందారు టీడీపీలో చేరిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అద్దంకిలో ఆయనే విజయం సాధించారు.. తద్వారా నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న బలమైన సంబంధాలు నిరూపితమయ్యాయి.

ఇక గత ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జగన్‌ ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరణం బలరాం, శిద్దా రాఘవరావులు పార్టీని వీడినా రవికుమార్‌ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఎలాంటి వివాదాలకు పోకుండా జిల్లాలోని పార్టీ నాయకులందరితో కలిసి నడవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకొనే రవికుమార్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లుగా పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.అలాగే ప్రభుత్వ డాక్టర్‌ అయిన స్వామి దామచర్ల కుటుంబం సహకారంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలిసారి అటు ఎమ్మెల్యేగా ఇటు టీటీడీ సభ్యుడిగా అద్భుత పాలనా వ్యవహారాలను సాగించారు. గత  వైసీపీ ప్రభుత్వ వేధింపులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు వారిరువురికి ప్రమోషన్స్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: