- సీఎం హోదాలో చంద్రబాబు  

- ప్రతిపక్ష హోదా వస్తుందని ఆంధ్రుల ఆశ    
- ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు

(ఏపీ - ఇండియా హెరాల్డ్ )

టిడిపి అధినేత చంద్రబాబు అనుకున్నది సాధించారు. 2019లో ఓడిపోయి ఐదేళ్లపాటు విపక్షంలో గడిపిన ఆయన ఇక ఎప్పుడూ మళ్లీ ఏపీకి కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బాబుని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా గోడకు కొట్టిన బంతిలా  మళ్లీ అంతే వేగంగాదూసుకు వచ్చిన ఆయన కార్యకర్తల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపుతూనే వచ్చారు. ఇక బాబుకు అటు కేంద్రం నుంచి కూడా మంచి మద్దతు ఉంది   అయితే ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు బరిలోకి దిగారు  

 ఈ క్రమంలోనే ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అనూహ్యమైన విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా 164 సీట్లలో విజయం సాధించడంతో అధికారం మరోసారి బాబు చేతిలోకి వచ్చేసింది  ఇటీవలే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇది చూడటానికి తెలుగు తమ్ముళ్లకు రెండు కళ్ళు సరిపోలేదు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. బాబు బాబుకి ఇప్పుడు ఒక హోదా వచ్చింది. మరి ఏపీకి ప్రత్యేక హోదా మాటేమిటి అనే విషయం ఇప్పుడు తెరమీదకి వస్తుంది.


 వాస్తవానికి  బాబు అధికారంలోకి రాగానే ఈ మాట వినిపించకూడదు. కానీ అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ లేదు. దీంతో ఒకరకంగా బిజెపికి ఆక్సిజన్ అందించి అధికారాన్ని తెచ్చిపెట్టింది చంద్రబాబే. దీన్నిబట్టి చూస్తే ఇక కేంద్రం ముందు చంద్రబాబు ఎన్నో రకాల కండిషన్లు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఏపీలో చంద్రబాబుకు బిజెపి సాయం అవసరం లేదు. ఎందుకంటే టిడిపికి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. కానీ కేంద్రంలో మోడీకి మాత్రం బిజెపి అవసరం ఎంతో ఉంది. చంద్రబాబు మద్దతు విరమించుకుంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది. దీంతో ప్రత్యేక హోదా సాధించేందుకు ఇదే సరైన సమయమని.. బిజెపి పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలి అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ ప్రత్యేక హోదా వస్తే అది రాష్ట్రానికి సంజీవనిగా ఉంటుందని ఎంతో మంది నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ బాబు మాత్రం ఎక్కడా ప్రత్యేక హోదా  గురించి మాట్లాడకపోవడం మాత్రం ఆంధ్రులకు ఆవేదన కలిగిస్తుంది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. టిడిపికి ఇప్పటికైనా మించిపోయింది లేదని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని.. ఇప్పుడే ప్రత్యేక హోదా సాధించేందుకు అవకాశం ఉంది అంటూ కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు  ఒకవేళ బాబు ఈ ప్రత్యేక హోదా ను సాధిస్తే మాత్రం ఇక ఏపీకి ఆయనను మించిన బాహుబలి మరొకరు ఉండరు.. ఆంధ్ర ప్రజల గుండెల్లో బాబు చిరస్థాయిగా నిలిచిపోతారని అంటున్నారు నిపుణులు  మరి రానున్న రోజుల్లో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: