వైఎస్‌ఆర్ కేబినేట్‌ లో మంత్రిగా అనుభవం
 రాజకీయ ఎత్తుగడలో వేయడంలో దిట్ట
 విద్యా, పశువైద్య శాఖల్లో అనుభవం
 25 ఏళ్ల రాజకీయ అనుభవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  లాంటి పెద్దల సమక్షంలో తెలుగుదేశం కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొత్త ప్రభుత్వంలో మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఇక దీంతో 24 మందిలో ఎవరికి ఏ శాఖ వస్తుందని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక.. చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి పొందిన వారిలో  కొలుసు పార్థసారధి ఒకరు.


ఏపీ మంత్రి పార్థసారధికి... దాదాపు 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్  అలాగే వైసిపి పార్టీలో అప్పట్లోనే కొనసాగిన పార్థసారథి... ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన  కీలకమైన నేత. 2004 సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు పార్థసారథి. 2004 సంవత్సరంలో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మొట్టమొదటిగా గెలిచారు పార్థసారధి. ఇక 2009, 2019లో కూడా పెనమలూరు నుంచి ఎన్నికయ్యారు.


ఎమ్మెల్యేగా పని చేయడమే కాకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి కీలకమైన నేత  కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం పార్థసారధికి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించిన పార్థసారధి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వైసీపీలో చేరారు.


ఇక 2019లో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ అప్పుడు ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఇక మొన్న ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు. టిడిపిలో చేరిన పార్థసారధికి పెనమలూరు కాకుండా నూజివీడు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో నూజివీడు నుంచి... ఎమ్మెల్యే గా గెలిచి ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు పార్థసారథి. ఇలా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌, చంద్రబాబు హయాంలో పార్థసారధి ఏదో ఒక పదవి వస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: