ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం బుధవారం రోజున ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు... నాలుగవసారి ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మరో 22 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 మంది సభ్యులతో ఏపీ కొత్త కేబినెట్ ఏర్పాటు అయింది. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో... పదవుల కోసం కొంతమంది... ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


జగన్మోహన్ రెడ్డి కాలంలో... కష్టాలు పడ్డ వారికి... తగిన పదవి ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుగుదేశం కూటమికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. ఆయనకు పదవి ఇవ్వడమే కాకుండా...  ఏపీలో మంచి పలుకుబడి ఉన్న చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని  జన సైనికులు డిమాండ్ చేస్తున్నారట.


చిరంజీవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే... కాపు సామాజిక వర్గం ఫుల్ హ్యాపీగా ఉంటుందని... భవిష్యత్తులో కూటమికి మంచి ఫలితాలు వస్తాయని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారట. అంతే కాకుండా చిరంజీవి లాంటి వ్యక్తికి.. ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తే... హైదరాబాదులో ఉన్న ఇండస్ట్రీని... ఏపీకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ తరలి రావడం అంటే కష్టమే కానీ... ప్రతి సినిమా ఖచ్చితంగా ఏపీలో షూట్ జరిగేలా... చర్యలు తీసుకోవాలి.


అప్పుడు ఏపీ అభివృద్ధి.. మరింత పెరుగుతుంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవికి మంచి అనుభవం ఉంది. కాబట్టి చిరంజీవికి తగిన పోస్ట్ ఇచ్చి... ఏపీ అభివృద్ధికి పాటుపడాలని డిమాండ్ తెరపైకి వస్తోంది. చిరంజీవికి పదవి ఇస్తే... పవన్ కళ్యాణ్ కి ఇచ్చినట్లే.  దీంతో పవన్ కళ్యాణ్ కూడా కాస్త రిలాక్స్ అవుతారు. తద్వారా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య... సఖ్యత కూడా పెరుగుతుంది. మరో ఐదు సంవత్సరాల పాటు.. ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగించవచ్చు. చంద్రబాబు కుటుంబంలో చాలామందికి పదవులు ఇస్తున్నారు అనే టాక్ కూడా... లేకుండా చేయాలంటే చిరంజీవికి పదవి ఇవ్వాలని కొంతమంది సూచనలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: