•మంత్రి పదవుల్లో అధికంగా విద్యావంతులు

•జగన్ వేధింపులకు గురైన వారికి మంత్రులుగా ఛాన్స్

•బాబు ప్లాన్ వేరే లెవెల్

(అమరావతి - ఇండియా హెరాల్డ్) : జూన్ 12 న చంద్రబాబు 4 వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర కొత్త మంత్రివర్గం అందరిలో ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే అందులో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా 11 మంది మంత్రులు మంచి విద్యావంతులే. వాళ్లందరూ కూడా పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, కందుల దుర్గేష్‌, టీజీ భరత్‌, కొండపల్లి శ్రీనివాస్‌ పీజీ చేశారు. డోలా బాల వీరాంజనేయస్వామి, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి వైద్యవిద్యను, ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర ఇంకా అలాగే వాసంశెట్టి సుభాష్‌ న్యాయ విద్యనభ్యసించారు. అలాగే కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్‌ అయితే ఇంజనీరింగ్‌ చదివారు. కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్‌.సవిత, గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్‌ డిగ్రీ చదివారు. ఎన్‌ఎండీ ఫరూక్‌, కొణిదెల పవన్‌ కల్యాణ్‌ విద్యార్హత పదో తరగతి కాగా, బీసీ జనార్దనరెడ్డి 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరు ముగ్గురు తప్ప మిగతా వారు బాగా చదువుకున్నవారు.ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బాగా చదువుకున్న నేతలు మంత్రులుగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. గత 5 సంవత్సరాల కాలంలో అంటే జగన్ ప్రభుత్వంలో విద్యావంతులు తక్కువ. అందువల్ల సరిగ్గా అభివృద్ధి జరగలేదు. ఫలితంగా జనాలు ఇప్పుడు తీర్పు ఇచ్చారు. టీడీపీకి మరో అవకాశం ఇచ్చారు. చదువుకున్న వారు మంత్రులుగా అధికారంలోకి  వస్తే రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వారికి కేటాయించిన శాఖలపై మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఏదైన సమస్య వస్తే వెంటనే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా బాబు సూపర్ ప్లాన్ తో తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

జగన్‌ ప్రభుత్వంలో వేధింపులకు గురై జైళ్లకు వెళ్లినవారు.. కేసుల్లో ఇరుక్కున్న బాధిత నేతలకు చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం విశేషం. వీరిలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఇంకా బీసీ జనార్దనరెడ్డి అరెస్టయి జైళ్లకు కూడా వెళ్లారు. నారాయణపై చాలా కేసులు నమోదైనా ఆయన అరెస్టు కాలేదు. న్యాయస్థానాల్లో ఆయనకు ఉపశమనం దక్కింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన వంగలపూడి అనిత కూడా కేసుల్లో ఇరుక్కుని వేధింపులకు గురయ్యారు. అలాగే రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డిపైనా పలు కేసులు బనాయించారు. ఇలా జగన్ ప్రభుత్వ వేధింపులకు గురైన వారిలో కొంత మందికి చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటిచ్చారు. ఇలా వీరికి ఛాన్స్ ఇవ్వడం వెనక కూడా చంద్రబాబు ప్లాన్ ఉంది. వీళ్ళకి ఛాన్స్ ఇస్తే వైసీపీకి భయం మొదలవుతుంది. అందువల్ల వాళ్ళు వాదించలేరు. పైగా వీళ్లంతా జగన్ హయాంలో గాయపడి ఇప్పుడు సింహాల్లా మారిన వారు కాబట్టి తమని వేధించిన ప్రతిపక్షాన్ని వణుకు పుట్టించగలరు. కాబట్టి వీరికి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వడం బాబు యొక్క సూపర్ ప్లాన్ అని తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: