- టిడిపిలో తిరుగులేని నాయకుడు..
- హ్యాట్రిక్ వీరుడు అనగాని..
- కీలక మంత్రి పదవి కొట్టబోతున్నాడా.?

 రేపల్లె నియోజకవర్గం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది  అనగాని సత్యప్రసాద్ మాత్రమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడిచినప్పుడు కూడా  రేపల్లెలో మాత్రం అనగాని హవానే నడిచింది. అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి అనగాని సత్య ప్రసాద్  ఇప్పటికే అక్కడ గెలిచి హ్యాట్రిక్ విజయన్ని అందుకున్నారు.  అలాంటి అనగాని సత్య ప్రసాద్ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. ఈయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాడు. ఈ విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి అనగాని సత్యప్రసాద్ టిడిపిలో కీలక నేతగా ఎదిగారు. బిసి కోట నుంచి ఆయనకు ఈసారి మంత్రిగా స్థానం దక్కింది.


 దీంతో ఆయన మొదటి సారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి టిడిపి పార్టీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి సత్యప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లా గొల్లపల్లి.  జనవరి 10, 1972లో జన్మించిన సత్యప్రసాద్. ఈయన తల్లిదండ్రులు రంగారావు, నాగమణి. ఈయన తండ్రి రంగారావు కూచినపూడి నియోజకవర్గం నుంచి  ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సత్యప్రసాద్ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. అలా ఎంతో ఎదిగినటువంటి సత్యప్రసాద్ 2009 రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.మొదటిసారి 2009వ సంవత్సరంలో టిడిపి రేపల్లె అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినా ఆ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై కొట్లాడుతూ వచ్చారు.

ఆ తర్వాత జరిగినటువంటి 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఈ విధంగా ఆయన మూడుసార్లు గెలుపొందడంతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన గొంతును గట్టిగా వినిపించారు. అసెంబ్లీలో వైసీపీ చేసిన పనులపై గట్టిగా ప్రశ్నించారు. ఈ విధంగా సత్యప్రసాద్ టాలెంట్ ను గుర్తించినటువంటి చంద్రబాబు ఈసారి ఆయనకు కేబినెట్ లో స్థానం కల్పించారు. మరి ఈయనకు టిడిపి అధిష్టానం విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. మరి ఈయనకు విద్యుత్ శాఖ ఇస్తారా లేదంటే ఇంకేదైనా శాఖ కేటాయిస్తారా అనేది ఇంకా కొన్ని గంటల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: