ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12న ముఖ్యమంత్రితో పాటు 24 మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు. లోకేష్ తదితరులు కూడా నిన్నటితో మరోసారి మంత్రులు అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ ప్రమాణ స్వీకారానికి ఒక తేడా ఉంది అని సోషల్ మీడియాలో పాలిటిక్స్ ఫాలోవర్లు చర్చ మొదలుపెట్టారు.

 2019లో జగన్ సీఎం అయినప్పుడు జగన్ కి మద్దతు తెలిపే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య నేతలు అందరూ కూడా హాజరయ్యారు. బీజేపీ నేతలు కూడా విచ్చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారంలో రాజకీయాలతో సంబంధంలేని సినీ సెలబ్రిటీలు కూడా వచ్చారు. ఉదాహరణకు చిరంజీవి రజినీకాంత్ రామ్ చరణ్ వంటి వారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి కాళ్లపై పడిపోతూ, అన్నయ్యతో కలిసి మోదీని కౌగిలించుకోవడం వంటి దృశ్యాలు చాలా హార్ట్ టచింగ్ గా కనిపించాయి. జగన్ ప్రమాణ స్వీకార సమయంలో ఇలాంటి దృశ్యాలు ఏవీ కనిపించలేదు.

రజనీకాంత్ చిరంజీవి కలిసి చంద్రబాబుకు చాలా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేశారు. కళామ్మతల్లికి ఎంతో సేవలు చేసిన ఇంత పెద్ద నటులు తమ పనులన్నీ పక్కనపెట్టి ఈ కార్యక్రమానికి వచ్చి చాలా సేపు ఉండటం నిజంగా విశేషం. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం విశేషం. మాజీ ఏపీ సీఎం జగన్ కార్యక్రమంలో ఇలాంటి మాట్లాడుకునే సంఘటనలేవి పెద్దగా చోటు చేసుకోలేదు. అందువల్ల వీరిద్దరి ప్రమాణ స్వీకారానికి ఈ తేడాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పలువురు చర్చిస్తున్నారు. అయితే చిరంజీవి త్వరలో ఏపీలో ఏదో ఒక అధికారం చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. టీటీడీ చైర్మన్ లాంటి పదవులు మెగా ఫ్యామిలీ లో ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: