ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. 175 కు 175 సీట్లు గెలుస్తామన్న వైసిపిని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది. ఇలా భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం కూడా చేసారు. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా మరోసారి మంత్రిగా ప్రమాణం చేసారు.తర్వాత అదే రోజు రాత్రి తిరుమలకి వెళ్లిన చంద్రబాబుని చూడడానికి ప్రజలు క్యూ కట్టారు.తిరుమల లో వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి స్వాగతం పలికారు.తిరుమల కొండపై చంద్రబాబు, నారా లోకేష్ లు తిరుగుతుండగా ఓ విషయాన్ని గమనించారు.దానిపై చంద్రబాబు సీరియస్ అవ్వగా లోకేష్ మాత్రం దా నిపై ఫన్నీగా జగన్ ను టార్గెట్ చేస్తా ట్రీట్ చేశారు.గతం లో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా భారీ పోలీస్ భద్రతను ఏర్పాటుచేసుకునేవారు. ప్రజాగ్రహం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పరదాలు కట్టేవారు.తన పర్యటనల్లో అనవసరపు ఆంక్షలు వద్దని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని అన్నారు. దీంతో ఇప్పటికే సీఎం పలుసార్లు చెప్పారని, ఆ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి. చిన్నపాటి వర్షం పడటం తో పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చంద్రబాబుతో పాటు లోకేష్ తడవకుండా ఉండేందుకు గొడుగులు సమకూర్చారు. ఈ క్రమంలో ఓ చోట పరదాలు కట్టి ఉండడం కనిపించినపుడు  నారా లోకేశ్ దాన్ని గమనించి ఇంకా పరదాల సంస్కృతి పోలేదా అని అడిగి అలవాటులో పొరపాటా అంటూ లోకేష్ నవ్వుతూ సెటైరికల్ గా మాట్లాడారు.ఇకనుంచి పరదాల మాటున పర్యటనలు ఉండవని తేల్చి చెప్పారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: