ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పట్టాభిషేకం భారీ అట్టహసంగా జరిగిన సంగతి తెల్సిందే. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి కావడం విశేషం.అయితే ఆయనతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు చంద్రబాబు కాబినెట్ లో డిప్యూటీ సీఎం, అలాగే మరో మంత్రిత్వ శాఖను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నందున్న ఈసారి కూడా ఐటీ, పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.అలాగే ప్రమాణస్వీకారం తర్వాత సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా వెంకన్న దర్శనం చేసుకొని తర్వాత విజయవాడ లోని కనకదుర్గ దేవాలయానికి కూడా వెళ్లి అక్కడ నుండి డైరెక్టుగా సచివాలయం చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు.టీడీపీ లాంటి పలు ప్రాంతీయ పార్టీలను పరిశీలిస్తే కొన్ని రాష్టాల్లో నేతలు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి.

మహారాష్ట్ర,పంజాబ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే అక్కడ పని చేసిన సీఎం లు వారి కొడుకులను తమ తమ కాబినెట్లో స్థానాలు కల్పించినవారే.అయితే మరోపక్క రెండు ప్రాంతీయ పార్టీలైన ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబ సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేకపోయారు.అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో మాత్రం సీఎం లుగా చేసినా లాలు,రబ్రీ దేవి, మూలయం సింగ్ హయాంలో మాత్రం వారి పిల్లలకి వారి కాబినెట్లో చోటు దక్కలేదు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన కొడుకు రాహుల్‌ గాంధీకి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు.దాని కారణంగానే రాహుల్ కు ప్రజల్లో పెద్దగా ఆదరణ కరువైయింది. దాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు లోకేష్ ను రాజకీయాల లోతు పరిచయం చేయడంకోసం తన కాబినెట్లో స్థానం కల్పిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: