ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముగిసిపోయాయి. లెక్కింపు జరిగి ప్రభుత్వం కూడా ఏర్పడింది. కూటమిగా ఏర్పడిన టిడిపి పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించింది. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ప్రతిపక్ష హోదాకు వచ్చే సీట్లు కూడా రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వైసీపీ  దారుణంగా చతికిలబడింది. ఇప్పటికీ ఆ నాయకులకు ఇలాంటి రిజల్ట్ ఎందుకు వచ్చింది అనేది అంతు పట్టడం లేదట.  కనీసం ప్రతిపక్ష హోదా సీట్లు కూడా రాలేదని ఎంతో మధనపడుతున్నారట. ఈ బాధ ఫిక్స్ స్టేజ్ లోకి వెళ్లి  లెక్కింపులో అవకతవకలు జరిగాయని అంటున్నారట. ఈవీఎంలను ఏమో చేశారని  మేము రాష్ట్రంలో ఎంతో చేశామని 99శాతం పథకాల అమలు చేసిన  ప్రజలు పూర్తిగా మీకు ఎలా ఓట్లు వేశారనే ఆలోచనలో పడ్డారట.  

మాకు రాష్ట్రంలో చాలావరకు ఓటింగ్ శాతం ఉందని, అయినా కానీ టిడిపి కూటమి ఎలా గెలిచిందని విపరీతంగా ఆలోచన చేస్తున్నారట. ఇదే తరుణంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విపరీతంగా మదన పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన ఇలాంటి కామెంట్లు చేశారు. వాస్తవాలకు లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో గోల్మాల్ జరిగిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఉదయం 9.30 గంటలకు టీవీలో వచ్చింది. ఇదే సమయంలో చాలా న్యూస్ చానల్స్ టిడిపికి 120 నుంచి 150 సీట్లు వస్తాయని గట్టిగా చెబుతూ వచ్చారు.  

ఈ విషయాన్ని ఈసీ పూర్తిగా వెల్లడించక ముందే వీళ్లే ఎలివేషన్ ఇచ్చేసారని దీంతో ఆందోళన చెందినటువంటి వైసిపి  ఏజెంట్లు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు.  దీంతో అక్కడున్నటువంటి ఉద్యోగులకు ఇష్టం వచ్చినట్టు మెజారిటీలు రాసుకున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. వాస్తవానికి ఏ ఏజెంట్ కైనా  ముందుగానే ఈసీ నిబంధనలు తెలియజేస్తుంది. చివరి స్థాయి ఓటింగ్ లెక్కింపు వరకు  అందులోనే ఉండాలని తెలియజేస్తుంది. మరి ఈ విషయం వైసిపి ఏజెంట్లకు తెలియదా. కాస్త మెజారిటీ టిడిపికి రాగానే వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం వచ్చింది అంటూ టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: