తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లపాటు ఉద్యమం చేసి  చివరికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏకధాటిగా పది సంవత్సరాల పాటు పాలించారు. అలాంటి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుస్తానని భావించారు. కానీ ప్రజలు అనూహ్య తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇక చివరికి పార్లమెంట్ ఎలక్షన్స్ లో నైనా తన సత్తా చాటుతుంది అనుకొని  బస్సు యాత్ర మొదలుపెట్టి రాష్ట్రమంతా తిరిగారు. అయినా ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా పార్లమెంటులో ఖాతా  తెరవలేదు.  దీంతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు  సమస్య అధికమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

పదేళ్లు పాలించిన ఆయన హయాంలో ఎంతో అవినీతి జరిగిందని, ఇందులో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. కేసిఆర్ చేసిన తప్పేంటి ఆ వివరాలు చూద్దాం.. ఈయన సీఎంగా ఉన్న సమయంలోనే కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పుడు పవర్ ఉంది కాబట్టి ఎవరు టచ్ చేయలేదు. ఇప్పుడు పవర్ లేదు కాబట్టి ఈ ఆరోపణలకు బలం చేకూరినట్టు అవుతోంది. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ ఆనవాళ్లు ఒక్కటి కూడా తెలంగాణలో లేకుండా చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ను జైలుకు పంపితే ఆయనపై ఉన్నటువంటి ప్రేమ ప్రజలకు తగ్గిపోతుందనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు విషయాలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.

 ప్రభుత్వంలో చేసిన చాలా పథకాలపై నిశితంగా పరిశీలన చేస్తున్నారు. కానీ వాటికి సరైన ఆధారాలు దొరకడం లేదు. ఈ క్రమంలోనే  ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. గొర్రెల పంపిణీ పథకం ఒక అస్త్రంగా లభించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారట. దీంతో  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగినట్టు సమాచారం. అంతే కాదు కేసీఆర్ పై కేసు కూడా నమోదు చేసిందట. ఇప్పటికే ఈడి అధికారులు రాష్ట్ర మేకల గొర్రెల పెంపకదారుల సహకార సమైక్య ఎండికి లేఖ రాసి తగిన ఆధారాలు ఇవ్వాలని అడిగిందట. దీని ద్వారానే నివేదిక తయారుచేసి ఈడి ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సరైన ఆధారాలు లేకుంటే మాత్రం కేసీఆర్ తప్పక జైలుకు వెళ్లాల్సి వస్తుంది.  ఈ విధంగా కేసీఆర్ ను ఎలాగైనా జైలుకు పంపాలనే కుట్రతో ఇటు రాష్ట్ర మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: