పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరీర్లు కొనసాగిస్తున్న సమయంలోనే జనసేన అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీని 2014 వ సంవత్సరం స్థాపించిన ఆ దఫా ఎన్నికలలో ఈ పార్టీ పోటీ చేయలేదు. ఇక 2019 వ సంవత్సరం ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలలో సభ్యులను బరిలో నిలిపినప్పటికీ ఈ పార్టీ కి భారీ దెబ్బ తగిలింది. ఈ పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క వ్యక్తి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగా , పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో పోటీ చేస్తే రెండిటిలోనూ ఓడిపోయాడు.

ఇక 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ టి డి పి , బి జె పి లతో భాగంగా పోటీ చేసింది. ఇక ఇందులో 21 అసెంబ్లీ , రెండు పార్లమెంట్ స్థానాలను తీసుకున్న జనసేన అన్నింటిలో గెలిచి 100% విజయాన్ని అందుకుంది. ఇక ఈ విజయం తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అందులో భాగంగా జనసేన ఈ విజయంలో కీలక పాత్రను పోషించడంతో ఈయనకు ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు మరికొన్ని కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక మొదటి సారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకొచ్చాడు. నేను ఒక్క రూపాయి జీతం తీసుకోను. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే కు ఎంత జీతం ఇస్తుందో , పూర్తి స్థాయిలో ఆ జీతాన్ని తీసుకుంటాను. ఎందుకు అంటే నేను ఒక్క రూపాయి జీతం కనుక తీసుకున్నట్లు అయితే నేను ప్రజల సొమ్ము తినట్లేదు కాబట్టి వారు నన్ను అడిగే అవకాశం ఉండదు. అదే నేను పూర్తి జీతం తీసుకుంటే వారు నేనేదైనా తప్పు చేస్తే నన్ను కాలర్ పట్టుకునే అడిగే హక్కు వారికి ఉంటుంది. అందుకే నేను పూర్తి జీతం తీసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక పవన్ ఇలా పూర్తి జీతం తీసుకుంటాను అని తెలియజేయడమే జనసేన నేతలు , కార్యకర్తలు , పవన్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: