- మాజీ మంత్రి స‌ల‌హాలు బాబుకు, కొత్త‌త‌రం నేత‌ల‌కు కీల‌క‌మే
- ప‌వ‌న్ విజ్ఞ‌త డైలాగుల‌తో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడుకు క‌ళ్లెం..!

( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )

ప్ర‌స్తుతం కొలుదీర‌నున్న అసెంబ్లీలో సీనియ‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. ముఖ్యంగా వివిధ అంశాల‌పై లోతైన అధ్య‌య‌నం చేసిన వారు.. కూడా ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. నిశిత దృష్టి, లోతైన ప‌ర్య‌వేక్ష‌ణ వంటివి చేయ‌డంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి దిట్ట‌. గ‌తంలో అనేక అంశాల పై ఆయ‌న పుస్త‌కాలు కూడా రాశారు. ముఖ్యంగా గ‌నులు, వ్య‌వ‌సాయం, జ‌ల‌వ‌న‌రుల‌పై ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. ఆయ‌న ఏం మాట్లాడాల‌న్నా కూడా.. ముందు ఆ అంశంపై అధ్య‌య‌నం చేస్తారు.


కేవ‌లం వార్త‌లు చూశో.. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలు ఆధారంగా చేసుకునే సోమిరెడ్డి ఎప్పుడూ మాట్లాడ‌ర‌నే పేరుంది. విష‌యం ఏదైనా కూడా.. ఆయ‌న ముందు తాను అర్ధం చేసుకుని.. త‌ర్వాత‌. వాటిపై చ‌ర్చ‌కు దిగుతారు. ఇప్పుడు స‌ర్వే ప‌ల్లి నుంచి పాతిక సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా .. అసెంబ్లీలో ఈయ‌నకు ప్రాధాన్యం ద‌క్కే అవ‌కాశం ఉంది. అంతేకాదు.. ప‌లు అంశాల‌పైనా ఆయ‌న చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు ఐకాన్‌గా నిలుస్తార‌న‌డంలో సందేహం లేదు.


సోమిరెడ్డికి ప్ర‌ధానంగా జ‌ల‌వ‌న‌రుల‌పైనా.. సాగునీటి రంగంపైనా.. వ్య‌వ‌సాయ అంశాల‌పైనా గ‌ట్టి ప‌ట్టుంది ., గ‌తంలోనూ ఆయ‌న వ్య‌వ‌సాయ మంత్రిగా ప‌నిచేసి ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఆయా రంగాల్లో అభి వృద్ధి బాట‌ప‌ట్టించేందుకు సోమిరెడ్డి స‌ల‌హాలు.. సూచ‌న‌లు కూడా.. ఎంతో ఉప‌యుక్తంగా మార‌నున్నాయి. పైగా ఆయ‌న అర్ధం చేసుకుని.. ఇత‌రుల‌కు కూడా అర్ధ‌మ‌య్యే రీతిలో వాటిని వివ‌రిస్తారు. దీంతో ఆయ‌న ఏం చెబుతారా. అని ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దీనిని బ‌ట్టి సోమిరెడ్డి స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా.. అసెంబ్లీకి కొత్త అర్థం చెబుతాయ‌న‌డంలో సందేహం లేదు.


బొండా ఉమా, ప్ర‌భాక‌ర్‌లు త‌గ్గాల్సిందే..!
మ‌రోవైపు.. టీడీపీ కీల‌క ఫైర్‌బ్రాండ్ నాయ‌కులు.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర రావు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ల‌కు ఈ సారి పెద్ద‌గా సౌండ్ ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే.. స‌భ‌లో కీల‌క‌మైన సీనియ‌ర్లు.. ఉంటున్న నేప‌థ్యానికి తోడు.. మారిన చంద్ర‌బాబు.. విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తామ‌న్న ప‌వ‌న్‌లు ఉంటున్న నేప‌థ్యంలో వీరు విసుర్లు విస‌ర‌డానికి.. విమ‌ర్శ‌లు చేయ‌డానికి .. నోరు చేసుకునేందుకు కూడా పెద్ద‌గా చాన్స్ ఉండ‌ద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: