మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉండి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న టిడిపి ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. జనసేన బీజేపీ పార్టీలతో కలిసి ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన టిడిపి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిపోతున్నారు. ఇక మంత్రులు కూడా ఇప్పటికే ప్రమాణస్వీకారం చేయగా.. వారికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి.


 ఇలా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీలో ఎంతోమంది విద్యావంతులైన కొత్త ఎమ్మెల్యేలు అడుగుపెట్టబోతున్నారు. దీంతో వారి ప్రసంగాలు ప్రజా సమస్యలపై పోరాటం ఎలా ఉండబోతుంది అని చూసేందుకు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే అసెంబ్లీలో ఎవరి ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం గురించి అంతట చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చన్నాయుడు ఈసారి అసెంబ్లీలో అదరగొట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు టిడిపి శ్రేణులు. అయితే గతంలో వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానిస్తూ మాట్లాడడంతో.. ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. సీఎం అయ్యే వరకు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనని శబదం చేసి చివరికి శాసనసభకు దూరంగానే ఉన్నారు.


 ఇలా టిడిపి బాస్ చంద్రబాబు దూరంగా ఉన్నప్పటికీ.. ఇక అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టింది.. ఏకంగా వైసిపి ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తూ ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తింది అచ్చన్నాయుడే అని చెప్పాలి. అసెంబ్లీలో అచ్చన్నకు అటు వైసిపి అని ఇబ్బందులు సృష్టించిన ఆయన పోరాటం మాత్రం ఆగలేదు. ఇలా చంద్రబాబు లేనప్పుడే అచ్చన్న అదరగొట్టాడు. ఇక ఇప్పుడు మంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. ఒకవైపు టిడిపి అధికారంలో ఉంది. ఇంకోవైపు చంద్రబాబు సీఎంగా ఉండడంతో.. ఇక అచ్చన్న ప్రసంగాలకు తిరుగు ఉండదని మొన్నటి వరకు ఇబ్బందులకు గురి చేసిన వైసీపీని ఒక ఆట ఆడుకుంటాడు అని టిడిపి శ్రేణులు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అచ్చన్న ప్రసంగం ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: