ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువురింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే సాధారణంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. ఆయన పాలన ఎలా సాగుతుంది అనే విషయాన్ని మాత్రమే కాదు.. సీఎం వ్యవహార శైలి కూడా అందరూ ఓ కంట కనిపెడుతూ ఉంటారు.


 ప్రజాధనాన్ని సీఎంగా ఉన్న వ్యక్తి ఎలా ఖర్చు పెడుతున్నారు అన్న విషయాన్ని చూస్తూనే ఉంటారు. ఇదే విషయంపై అటు ప్రతిపక్షాలు కూడా కన్నేసి విమర్శలు చేయడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే ప్రస్తుతం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క అలవాటును మార్చుకుంటే ఇక ఆయన రోల్ మోడల్ గా మారడం ఖాయం అని ఎంతో మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే విమానంలో తిరగడం. సాధారణంగా సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఎడాపెడ తిరిగేస్తూ ఉంటారు. మొన్నటి వరకు విపక్ష నేతగా ఉన్నప్పుడు సాధారణ విమానాల్లోనే ఆయన ప్రయాణం సాగించారు.


 ఇటీవల కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఇలా ప్రత్యేక విమానాన్ని వినియోగించారు. అయితే విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎలా అయితే సాదాసీదాగా వ్యవహరిస్తారో.. అలాంటి తీరునే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యవహరిస్తే ఆయనని రోల్ మోడల్ గా అందరూ పిలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా కాలు బయటకు తీస్తే చాలు ప్రత్యేక విమానాన్ని వినియోగించేవారు. చివరికి పంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా.. ఈ ప్రత్యేక విమానాన్ని వాడారు  కానీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రం అలా చేయడం లేదు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లను చాలా అరుదుగా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక ఎక్కువగా ఆయన సాదాసీదా విమానాలలో మాత్రమే జర్నీ చేస్తున్నారు. అయితే కేసీఆర్ తో పోల్చి చూస్తే ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఎక్కువసార్లు వెళ్తున్నారు. వెళ్లిన ప్రతిసారి కూడా ప్రత్యేక విమానం కాకుండా సాధారణ విమానంలోనే ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా తన శిష్యుడు రేవంత్ అనుసరిస్తున్న మార్గాన్నే అనుసరిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానాలను వాడి సీఎం అయ్యాక కూడా అలాగే వాడితే.. ఎలాంటి ఇబ్బంది ఉండదని.. కానీ అందుకు భిన్నంగా వాడితేనే.. ఇక ప్రతిపక్షాలకు విమర్శలు చేసేందుకు.. ప్రజలు ప్రజా ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నారు అని అనుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: