•పవన్, లోకేష్ రాకతో రసవత్తరంగా మారనున్న అసెంబ్లీ


•ఆకలితో ఉన్న సింహంలా వైసీపీ నాయకులపై పవన్ పంజా విసరడం పక్కా


•తన తండ్రిని అవమానించిన వారిని లోకేష్ లాజిక్ తో కొట్టడం ఖాయం


అమరావతి - ఇండియా హెరాల్డ్: ఈసారి ఎన్నికలలో టీడీపీ కూటమి వైసీపీపై భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 వ సారి బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి తన మంత్రి వర్గాన్ని కూడా పక్కా ప్లాన్ తో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం తన మంత్రి వర్గంలో అందరి చూపు పవన్ కళ్యాణ్ పై పడింది. అలాగే లోకేష్ పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి అసెంబ్లీ సమావేశాలకి ఈసారి పవన్, లోకేష్ ఎంట్రీ ఇస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి అసెంబ్లీలో వైసీపీ హవా నడించింది. వైసీపీ నాయకుల డామినేషన్ హైలైట్ అయ్యింది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ తరుపున పవన్, లోకేష్ ల పై భారీ అంచనాలు ఉన్నాయి.


ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ ప్రసంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన స్పీచులకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అసలు ఈ ఎన్నికలలో టీడీపీ కూటమి గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలే. పవన్ ప్రసంగాలతో ఆంధ్రా జనాలు ఊగిపోయారు. ఆయన ప్రసంగాలకు ప్రజలు ఫిదా అయ్యారు. పవన్ మాట తూట. అందుకే ఆయన మాట ప్రతి చోటా పేలింది. టాప్ లేపింది. దెబ్బతో 21 సీట్లు రాలాయి. అలాంటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? అరుపులు, చప్పట్లతో దద్దరిల్లిపోదు..అసలు పవన్ ప్రశ్నలకు, పంచులకు వైసీపీ నాయకుల రియాక్షన్స్ ఎలా ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది. ప్రచారాల్లోనే వేట కోసం వెళ్లిన పులిలా తన ప్రసంగాలతో వైసీపీని చిత్తు చేశాడు పవన్ కళ్యాణ్. ఇక అసెంబ్లీ అంటే.. ఖచ్చితంగా ఆకలితో సింహంలా రెచ్చిపోవడం ఖాయం.


ఇక మరో మంత్రి నారా లోకేష్ విషయానికి వస్తే.. లోకేష్ గతంలో కంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా స్ట్రాంగ్ అయ్యాడు. గత తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాడు. ఒకప్పుడు తన మాటలతో తడబడ్డ లోకేష్.. ఇప్పుడు తన మాట తీరుని మార్చుకున్నాడు. నాలెడ్జ్ పెంచుకొని లాజిక్ గా మాట్లాడటం నేర్చుకున్నాడు. ప్రచారాల్లో లోకేష్ ప్రసంగాలు చూస్తే అర్ధం అవుతుంది. తను ఎంతలా తనని మార్చుకున్నాడనేది. అలాంటి లోకేష్ కూడా ఈసారి అసెంబ్లీలో తన ప్రసంగాలతో ఆకట్టుకోవడం ఖాయం. తన తండ్రిని అవమానించిన వైసీపీ నాయకుల పై విరుచుకుపడటం ఖాయం. ఇప్పుడు అందరి చూపంతా పవన్, లోకేష్ ల పై ఉంది. వీళ్ళ ప్రసంగాలతో అసెంబ్లీ దద్దరిల్లడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: