•రాజకీయ అనుభవంతో చంద్రబాబు సక్సెస్ అవుతారా

•రాజకీయం అనే చదరంగంలో పవన్ రియల్ హీరో అవుతారా

•మరి అసెంబ్లీలో రియల్ హీరో ఎవరు?(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
దాదాపు 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది టిడిపి ప్రభుత్వం.. ఇక ఈసారి అందరినీ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసి విజయకేతనం ఎగరవేసింది. ముఖ్యంగా ఈసారి అసెంబ్లీలోకి వెళ్లబోయే మంత్రులు,  ఎమ్మెల్యేలు అందరూ దాదాపు చదువుకున్న వారే కావడం గమనార్హం.. ఇక వీరందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతారని,  వారికి కేటాయించిన అన్ని రంగాలలో వారు సక్సెస్ అవుతారు అనే దిశగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆలోచించి ఈ విధంగా వారిని నియమించినట్లు తెలుస్తోంది. ఏదైనా సరే అనుభవం ఉన్న రంగంలోనే నియమితమైతే కచ్చితంగా ఆ రంగంలో అభివృద్ధిని సాధించడానికి మరింత సులభం అవుతుంది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నేర్చుకున్న మొదటి అంశం ఇదే అని చెప్పవచ్చు.

రాజకీయ ఎత్తుగడలకు పైఎత్తులు వేసి.. అటు కేంద్రాన్ని సైతం తన గుప్పెట్లో పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్రాన్ని పరిపాలించడం అంత కష్టమేమీ కాదు.. ఆయన రాజకీయ అనుభవం ముందు ఏవైనా సరే తేట తెల్లం అవ్వాల్సిందే... అందుకే ప్రజలు భారీ మెజారిటీతో చంద్రబాబును గెలిపించుకొని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారు.. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న వార్తలేమిటంటే చంద్రబాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే మళ్ళీ అధికారంలోకి వచ్చారని.. ఆయన లేకపోతే టిడిపి గెలవదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా తన వంతు కృషిచేసి అటు సినీ సెలబ్రిటీలను ఆకర్షించి అభిమానులను ఓటర్లుగా మార్చుకొని 21 స్థానాలలో 21 కైవసం చేసుకొని 100% స్ట్రైక్ తో చరిత్ర సృష్టించాడు.. ఇలాంటి ఇద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.. ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు ఉపముఖ్యమంత్రిగా.. నువ్వా నేనా అంటూ సమస్యలను ఎత్తిచూపి వాటిని సాల్వ్ చేసే దిశగా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ఇద్దరిలో ఎవరు అసెంబ్లీలో హైలెట్ అవుతారు..?  ఎవరు హీరోగా నిలబడతారు?  అనేది ఇప్పుడు ప్రజలలో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం.. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. ప్రజలనే నమ్ముకున్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎవరు హీరోలుగా నిలుస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: