* పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు  
*  స్పీకర్ గా అనుభవం  
* సుదీర్ఘ రాజకీయ చరిత్ర
* అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో... నాదెండ్ల మనోహర్  అఖండ విజయాన్ని సాధించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకున్నారు నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా త్వరలోనే బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ కు  అత్యంత సన్నిహితుడుగా... ఆయన వెంట నడిచారు నాదెండ్ల మనోహర్.


పవన్ కళ్యాణ్ కు కష్టం వచ్చినప్పుడు అల్లా... వెనుకుండి  ఆయనను ముందుకు నడిపించారు. ఓటములు ఎదురైనా... ఎక్కడ తగ్గలేదు నాదెండ్ల మనోహర్. జనసేన జెండాను ఎక్కడ కూడా చేజారనివ్వకుండా...వీరుడిలా ఎదిగారు. ఇక అటు తన రాజకీయ అనుభవం కూడా సుదీర్ఘంగా ఉంది. తెనాలి నియోజకవర్గ నుంచి... ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 40 వేల మెజారిటీతో... జనసేన తరఫున విజయం సాధించారు  నాదెండ్ల మనోహర్.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు నాదెండ్ల మనోహర్. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైయస్ కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ లైబ్రరీ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో కీలక నేతగా ఉండి... కూటమి విజయానికి కారకుడు అయ్యాడు నాదెండ్ల మనోహర్. అంతే కాదు సుదీర్ఘకాలం తర్వాత తెనాలి నుంచి  మంత్రి పదవి దక్కించుకొని రికార్డు లోకి ఎక్కారు.


ఇక దాదాపు పది సంవత్సరాల నుంచి అసెంబ్లీకి దూరంగా ఉన్న నాదెండ్ల మనోహర్... ఈసారి ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా... అసెంబ్లీలో తన సత్తా చాటబోతున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఏపీ ప్రజలు పడ్డ కష్టాలను అసెంబ్లీ దృష్టికి తీసుకురాబోతున్నారు. తన అనుభవంతో...  సలహాలు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో స్పీకర్ హోదాలో ఉన్న నాదెండ్ల మనోహర్.. కొత్త ఎమ్మెల్యేలకు కూడా... అసెంబ్లీలో ఎలా మెదగాలనే దానిపై కూడా దిశా నిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. అటు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి... ఏ రేంజ్ లో కౌంటర్ ఇవ్వాలో...  ఆ రేంజ్ కు కూడా ప్రిపేర్ అవుతున్నారు నాదేండ్ల మనోహరుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: