ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇచ్చిన హామీలను సైతం అమలు చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు.. అయితే తాజాగా కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ ని షేర్ చేశారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీకి సంబంధించి ఫైల్ మీద చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో అలాగే ప్రజల ఆస్తులను రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయబోతున్నట్లు మరొక సంతకం అలాగే పింఛన్లు 3000 నుంచి 4 వేలకు పెంచుతూ మూడవ సంతకం పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్  ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ కూడా మొదలుపెట్టారని యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెక్షన్ ని కూడా ఐదవ సంతకం చేశారని తెలియజేశారు పవన్ కళ్యాణ్.. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ముందుకు కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మొదటి అడుగులు పడ్డాయని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.


అలాగే మేనిఫెస్టోలో ప్రకటించిన వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మొదలు పెడుతూ ముందుకు అడుగులు వేయబోతున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. కీలకమైన పదవులలో కూడా అటు బిజెపి నేతలను జనసేన నేతలను టిడిపి నేతలను సైతం ఉంచడం జరిగింది. మరి రాబోయే రోజులలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యోగ సంక్షేమాల కోసమే పాటుపడుతూ ఉంటానని తెలిపారు..అలాగె  పిఠాపురం ప్రజలను కలిసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఈనెల 20వ తేదీన అందరిని పలకరించడానికి సిద్ధం అంటూ తెలియజేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన సంతకాల పైన ఈ విధంగా ట్విట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: