జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన దాదాపు 12 సంవత్సరాల తర్వాత... ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా... ఏపీ మంత్రిగా కూడా తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం కోసం... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కృషి అంతా ఇంతా కాదు.


ఏపీలో వైసీపీని ఓడించేందుకు... కంకణం కట్టుకొని... సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో... జనసేన పార్టీని 100కు 100% ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించుకోగలిగారు.  కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన 21 ఎమ్మెల్యేలను  ఒంటి చేత్తో గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్.... ఈసారి మాత్రం ఎమ్మెల్యే సాబ్ అనిపించుకున్నారు.

2019 ఎన్నికల్లో... భీమవరం అలాగే గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున  ఎమ్మెల్యేగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. అయితే ఈ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ను  జగన్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే ఈసారి వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్... పిఠాపురం నుంచి బరిలో దిగి... దాదాపు 70 వేలకు పైగా  మెజారిటీని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు... ఏపీలో డిప్యూటీ ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి కూడా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని... మరో 20 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఏలబోతున్నాడని... ప్రముఖ జ్యోతిష్యుడు  సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఆయనకున్న దోషాలన్నీ తొలగిపోయాయని... ఇక రాజ్యాధికారం 20 సంవత్సరాల పాటు  పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటుందని తెలిపాడు. తన పార్టీని... ఏపీలో చాలా బలంగా తయారు చేసుకునే శక్తి పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు వచ్చిందని... ఆయన జాతకం ప్రకారం... పవన్ కళ్యాణ్ ను ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: