•ఈసారి అసెంబ్లీ హీరో బాబే
•శపధం చేసి మరీ అసెంబ్లీలో సీఎంగా అడుగుపెడుతున్న బాబు
•బాబు ఎంట్రీతో వైసీపీ నాయకులు బ్లాస్ట్ అవ్వడం పక్కా

(అమరావతి - ఇండియా హెరాల్డ్) : ఆంధ్రప్రదేశ్ తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు గెలిచాక ఒక మాట అన్నారు. గెలుపు, ఓటములు శాశ్వతం కాదు.. పార్టీలు శాశ్వతం.. ప్రజల తీర్పు శాశ్వతం అని అన్నారు. అది ముమ్మాటికీ నిజం. గెలుపు, ఓటములు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఇక్కడ ప్రజలే నిజమైన హీరోలు.. వాళ్ళు ప్రతీది చూస్తారు.. కాబట్టి గెలిచామని విర్రవీగకూడదు. ఓడిపోయామని కూలబడిపోకూడదు. ఒక్కోసారి బండ్లు ఓడలేవుతాయి. ఓడలు బండ్లవుతాయి. ఒక్కసారి గెలవగానే రాష్ట్రానికి నియంత అనుకోకూడదు. తన రాజకీయ అనుభవంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న చంద్రబాబు వైసీపీ హయాంలో బాధపడినట్టు ఎన్నడూ బాధ పడలేదు. అప్పుడు అసెంబ్లీలో వైసీపీ నాయకులు చేసిన అవమానానికి బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. అసెంబ్లీ సభని కౌరవ సభగా భావించి మళ్ళీ అడుగుపెడితే సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతా అని ఛాలెంజ్ చేసి మరి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే జరుగుతుంది. శపధం చేసి మరి సీఎం అయ్యి అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాలు మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.

కానీ రియల్ లైఫ్ లో సీనియర్ నాయకుడి పవర్ ఏంటో గర్వంతో, అధికార మదంతో ఊగిపోతున్న ఉడుకు రక్తానికి చూపించాడు చంద్రబాబు. తనని అసెంబ్లీలో దారుణంగా అవమానించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఇంకా  వైసీపీ నాయకులని వణికించబోతున్నాడు. ఇప్పటికే వైసీపీ నాయకులు అసెంబ్లీలో కనబడబోయే సినిమాని ఊహించుకొని వణుకుతున్నారు.ఇక అసెంబ్లీలో బాబుని చూసాకా అవమానించిన నోళ్లు ఖచ్చితంగా మూగబోవడం ఖాయం. బాబు తాను చేసిన ఛాలెంజ్ ని నెరవేర్చుకున్నాడు. ఇక వైసీపీ నాయకులు అసెంబ్లీలో బాబు ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెబుతారో అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.బాబు ఎంట్రీతో అసెంబ్లీలో వైసీపీ నాయకులు బ్లాస్ట్ కావడం పక్కా అని టీడీపీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీ రియల్ హీరో మాత్రం చంద్రబాబే అని టీడీపీ ఫ్యాన్స్ అంటున్నారు. వైసీపీ అక్రమాలని చంద్రబాబు బట్ట బయలు చేయడం ఖాయం అంటున్నారు. ఈ ఎన్నికల్లో బాబు వైసీపీ పై ఘన విజయం సాధించారు. తన రాజకీయ అనుభవంలో బాబుకి ఇంతకన్నా కిక్ ఇచ్చే విజయం ఇంకోటి ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి చూడాలి అసెంబ్లీలో వైసీపీ నాయకుల పై బాబు బ్లాస్ట్ ఏ విధంగా ఉంటుందనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: