ఏపీ రాజకీయాలపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలపై దాడులు చేస్తున్న టీడీపీ నాయకులను కోర్టు లాగాలని జగన్‌ కు సూచించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు చెప్పిన ఆయన ...చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని.. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు తోటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వివరించారు.

ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రావలసినవి రాబట్టాలని, మీరు ఏమి చెప్పితే అదే జరుగుతుందని వెల్లడించారు. అటు ఈవీఎంలపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని... చంద్రబాబు ఇటువంటి అపోహలు తొలగించే ప్రయత్నం చేయాలని కోరారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఎన్డీఏ కు, ఇండియా కోటమికి మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే తేడానని... ప్రస్తుతం కోర్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కేసు ప్రభుత్వం తరఫున కొనసాగించండని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై పార్లమెంటు తొలి సమావేశంలోనే నోటీస్ ఇచ్చి చర్చ పెట్టండని కోరారు. జగన్ కు కూడా ఉండవల్లి సూచనలు చేశారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వైసిపి పార్టీ లేదని అనుకోకండి...వైసిపి నాయకులు... కార్యకర్తలతో పార్టీని ప్రతిష్టపరుచుకోండని సూచనలు చేశారు. వైసిపి పని అయిపోయింది అనుకుంటే పొరపాటేనని... వైసీపీ కార్యకర్తలతో జరుగుతున్న దాడులపై కోర్టుకెళ్లండన్నారు.  జగన్ కు 11 సీట్లు వచ్చినా చాప్టర్ క్లోజ్ అయినట్లు కాదని... 2019లో టీడీపీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు వైసీపీకి ఎక్కువ వచ్చాయని వివరించారు.

చంద్రబాబు కసితో పనిచేసి మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలిపారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ ఓటమికి కారణం కక్ష రాజకీయాలు అని... జగన్ కక్ష రాజకీయాలు చూసి మిడిల్ క్లాస్ దూరం అయ్యారని వివరించారు. లిక్కర్ అధిక రేట్ల కారణంగా పేద వర్గాలు జగన్ కు దూరం అయ్యారని తెలిపారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: