ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల శాఖల కేటాయింపులో ఉత్కంఠతకు తెరపడింది. ఈనెల 12వ తేదీన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే... రెండు రోజులు సమయం తీసుకుని మంత్రులకు శాఖలు కేటాయించారు, సీఎం చంద్రబాబు నాయుడు. తీవ్ర తర్జనభర్జనల తర్వాత... మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు నాయుడు. అయితే అందరూ ఊహించినట్టుగానే... జనసేన పార్టీకి... శాఖల విషయంలో అన్యాయమే జరిగింది.


24 మందికి శాఖలు కేటాయించిన చంద్రబాబు నాయుడు... జనసేన పార్టీకి ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే కాకుండా... పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా పదవులు ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇందులో ఏ శాఖ కూడా నాలుగు గీసుకోవడానికి  పనిచేయదని జనసేన పార్టి సీనియర్ నాయకులు ఫైర్ అవుతున్నారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హోంశాఖ మంత్రి పదవి ఇస్తే...బాగుం డేదని.. కానీ ఈ విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారని వారు ఫైర్ అవుతున్నారు. ఈ అటు నాదేండ్ల మనోహర్ కు  పౌరసరఫరాల శాఖ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. స్పీకర్ గా అలాగే కాంగ్రెస్ పార్టీలో  సుదీర్ఘకాలం పనిచేసిన నాదెండ్ల  మనోహర్ కు ఆర్థిక శాఖ లాంటి పదవి ఇస్తే బాగుండేదని అంటున్నారు.


కానీ ఆయనకు పౌరసరఫరాల శాఖ ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించాలని ఫైర్ అవుతున్నారు జనసైనికులు. ఇటు కందుల దుర్గేష్ కు పర్యావరణం అలాగే సాంస్కృతిక శాఖ ఇచ్చి... అవమానించారని ఫైర్ అవుతున్నారు. ఆర్థిక శాఖ, హోం శాఖ, నీటిపారుదల అలాగే ఆరోగ్యం ఇలా అన్ని కీలక శాఖలన్నీ తెలుగుదేశం మంత్రులకు ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. వెంటనే మళ్ళీ శాఖలను కేటాయించాలని.. జనసేన పార్టీకి మంచి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే.. నిరసనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: