ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ప్రముఖ నేతలు చోటు సంపాదించుకున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ముగ్గురు జనసేన నేతలు మంత్రులయ్యారు. వారిలో ఒకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు ఫారెస్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. మరొకరు నాదెండ్ల మనోహర్. ఆయనకు పౌర సరఫరాల శాఖకు మంత్రిని చేశారు. తెనాలి నుంచి 48,112 ఓట్ల మెజారిటీతో వైసీపీ అన్నబత్తుని శివకుమార్ పై విజయం సాధించారు. చాలా అనుభవం ఉన్న నేత కాబట్టి ఈయనకు మంత్రివర్గంలో చంద్రబాబు చోటు కల్పించారు.

తరువాత జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ కు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిని చేశారు. గతంలో కందుల దుర్గేష్‌ నిడదవోలు నుంచి గెలిచారు. ఈసారి ఆయన రాజమహేంద్రవరం రూరల్ సీటు ఎక్స్‌పెక్ట్ చేశారు కానీ చివరి నిమిషంలో నిడదవోలు నుంచే పోటీ చేసి అక్కడ ఘన విజయం సాధించారు. జనసేన నుంచి మంత్రివర్గంలో చోటు దక్కిన ముగ్గురిలో దుర్గేష్ ఒకరు. అయితే ఈ ముగ్గురిలో ఒక పవన్ కి తప్ప మిగతా వారు ఎవరికి కూడా కీలకమైన పదవిని అందివ్వలేదు. ఇద్దరికీ కూడా మామూలు శాఖలు చేసి చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు.

బీజేపీలో ఒకే ఒక్క నేతకు మంత్రి పదవి ఇచ్చారు అది కూడా చాలా కీలకమైనది. బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. స‌త్య‌కుమార్ ఒక్క‌డే ఉన్నా ఏకంగా కీల‌క‌మైన ఆరోగ్య శాఖకు మంత్రి కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. సత్య కుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1,06,544 ఓట్లు సాధించి 3,734 మెజారిటీతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై విజయం సాధించారు. బీజేపీ గెలుచుకున్న ఓట్లు తక్కువే సత్య కుమార్ కూడా టీడీపీ కూటమి కోసం పవన్ కళ్యాణ్ పడ్డంత కష్టం పడలేదు. అయినా పవన్ కళ్యాణ్ మంత్రులలో కీలకమైన హెల్త్ మినిస్టర్ అందివ్వకుండా సత్య కుమార్ కు అప్పజెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జ‌న‌సేన‌కు ముగ్గురు మంత్రులున్నా వేస్టే... బీజేపీకి ఒక్క మంత్రైనా ది బెస్టే అని రాజకీయ పరిశీలకులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: