కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీలోకి దిగాయి. ఈ ఎన్నికలలో కూటమి కి మంచి విజయం దక్కింది. పొత్తులో భాగంగా బిజెపి కి 10 అసెంబ్లీ స్థానాలను ఇవ్వగా అందులో 8 స్థానాలలో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బిజెపి పార్టీ నుండి గెలుపొందిన 8 మందిలో సత్య కుమార్ యాదవ్ ఒకరు. మొదటి నుండి సత్య కుమార్ యాదవ్ కి మంత్రి పదవి వస్తుంది అని చాలా మంది అనుకున్నారు.

అనుకున్నట్లుగానే ఈయనకు మంత్రి పదవి డిసైడ్ అయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈయన కూడా మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశాడు. బీసీ , యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్య కుమార్ యాదవ్ ధర్మవరం నియోజక వర్గం నుండి పోటీ చేశారు. ఈయన మొట్ట మొదటి సారి ఎమ్మెల్యే గా పోటీ చేసి మొదటి ప్రయత్నం లోనే విజయం సాధించాడు. ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ లో ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చారు అనే విషయాన్ని బయటకి వెల్లడించారు.

అందులో భాగంగా సత్య కుమార్ యాదవ్ కు ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం మరియు వైద్య , విద్య శాఖలను ఇచ్చారు. ఇకపోతే ఈయన తాజాగా మంత్రి పదవి దక్కడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అందులో భాగంగా ఈయన ... నాకు ఎంతో గొప్ప మరియు ప్రతిష్టాత్మకమైన శాఖలను కేటాయించినందుకు బీజేపీ పెద్దలు, సీఎం చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు. ప్రజలకు అంకితభావంతో సేవ చేయడానికి కష్టపడతాను. ప్రతి వ్యక్తి ఆరోగ్యం , శ్రేయస్సును మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తాను అని ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sky