ఏపీలో తెలుగు దేశం కూటమి అధికారంలో వచ్చి.. మంత్రి పదవుల కేటాయింపులు కూడా జరిగాయి. అయితే... ఈ కేబినేట్‌ విస్తరణలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిరాశే మిగిలింది. సీనియారిటీ పార్టీ విషయంలో సిన్సియారిటీ దృష్ట్యా ఈసారి తనకు కేబినెట్ బెర్త్ ఖాయమని అనుకున్నారు ఆయన. కానీ ఫైనల్ గా అవకాశం రాకపోవడంతో షాక్ లో ఉన్నారని తెలుస్తోంది.  రాజమండ్రి రూరల్ నుంచి 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చౌదరి అంతకు ముందు రాజమండ్రి సిటీ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటిదాకా 10 సార్లు పోటీ చేస్తే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బుచ్చయ్య.


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో హైయెస్ట్ సక్సెస్ రికార్డు ఆయన పేరుతోనే ఉంది. ఈసారి విజయంతో పండగ చేసుకునే పార్టీ శ్రేణుల ఉత్సాహం మీద మంత్రి పదవి ఇవ్వకపోవడం నీళ్లు చల్లిందంటున్నారు పరిశీలకులు. 1995 లో ఎన్టీఆర్ కేబినెట్లో కొంతకాలం మాత్రమే పనిచేసిన గోరంట్లకు ఆ తర్వాత ఎప్పుడు అమాత్య యోగం దక్కలేదు. చంద్రబాబు నేతృత్వంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా కాగా అందులో నాలుగు సార్లు టీడీపీ అధికారంలో ఉంది. అయినా సరే ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, పైగా ఇదే ఆఖరి ఛాన్స్ అంటున్న కనీసం పరిగణలోకి తీసుకోలేదని అసంతృప్తిగా ఉన్నారట గోరంట్ల బుచ్చయ్య చౌదరి సన్నిహితులు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటలు. వైసీపీకి ఎదురుగాలుల్లోను ఈ నియోజకవర్గాల్లో టిడిపి విజయం సాధించింది.


ఈ మూడు చోట్ల కమ్మ సామాజిక వర్గాన్ని డిసైడింగ్ ఓన్ ఫ్యాక్టర్ కానప్పటికీ వారి ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది. అలాగే రాజానగరం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఆ టికెట్ ను కమ్మ నేతలకే ఇస్తుంది టిడిపి. కానీ ఈసారి ప్రయోగాత్మకంగా కాపులకు ఇచ్చి సక్సెస్ అయింది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి వరుసగా మూడుసార్లు మండపేట నుంచి వేపుల జోగేశ్వర్ రావ్ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయినా కూడా మంత్రివర్గంలో ఒక్కసారి కూడా చోటు దక్కలేదు. ఇప్పటికే చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన కూడా ఒక్కసారి కూడా తూర్పుగోదావరి జిల్లాలో కమ్మ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కలేదు.


సామాజిక వర్గ సమీకరణాల లెక్కలే కారణమని పార్టీ వర్గాల మాట. తూర్పుగోదావరి జిల్లాలో డిసైడింగ్ ఓన్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్స్ అయిన కాపు, శెట్టిబలిజ, ఎస్సీ సామాజిక వర్గాలనే ఎప్పుడు మంత్రి పదవులు వరిస్తున్నాయి. ఈసారి కూడా అదే జరిగింది అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కు రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ కు చోటు దక్కింది. వీరిద్దరూ కాపు, శెట్టి బలిజ, సామాజిక వర్గానికి చెందినవారు. ఈసారి కూడా తూర్పుగోదావరి కమ్మ ఎమ్మెల్యేలకు కేబినెట్ బెర్తులు దక్కకపోవడంపై ఆ నేతలలో అసంతృప్తి పెరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే 78 ఏళ్ల వయసు పైబడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. అయితే.. పదవి రాకున్నా పార్టీ కోసం పని చేస్తానని కాస్త బాధగానే చెబుతున్నారట గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: