ఏపీలో రాజకీయాలలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉండే పేరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ,చంద్రబాబులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు రానే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఫలితాలలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చిందని.. బిజెపితో పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు కూటమి పొత్తు లేకపోతే ప్రధాన మోడీకే నష్టం జరుగుతుందని వెల్లడించారు.


ఇలాంటి సమయంలోనైనా రాష్ట్రానికి కావలసిన వాటన్నిటిని రాబట్టుకోవాలి అంటూ ఉండవల్లి తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం కాకుండా రైల్వే జోన్ లో ఏర్పాట్లు వంటివి డిమాండ్ చేయాలని తెలిపారు. అలాగే 11 స్థానాలు గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లి పోరాడాలని కూడా తెలిపారు. ఆంధ్రాలో కూడా తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని కరుణానిధికి ఏడు స్థానాలు వచ్చిన జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన ప్రతిపక్ష నిర్వహించే సమయంలో సక్సెస్ అయ్యి మళ్ళీ అధికారంలోకి చేపట్టారని తెలిపారు.


ఉల్లిపాయ ధర పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదల వైసీపీకి ఓటమి కారణమయ్యాయని..ఈవీఎంల పైన ప్రజలకు అపోహలు ఉన్నాయని కూడా తెలియజేశారు ఉండవల్లి. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రభుత్వం తరఫున కొనసాగించండి అంటూ కూడా వెల్లడించారు. అలాగే వైయస్ జగన్ కి కూడా ఉండవల్లి పలు రకాల సలహాలు ఇచ్చారు.. వైసీపీ పని అయిపోయిందనుకోవద్దండి అది పొరపాటే వైసిపి కార్యకర్తల పైన జరుగుతున్న దాడుల పైన కోర్టుకు వెళ్ళండి ఇక ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి మధ్య కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే ఉన్నదంటు తెలిపారు. ప్రస్తుతం మోడీ అహంకారం తగ్గింది జగన్ కు 11 సీట్లు వచ్చిన చాప్టర్ క్లోజ్ కాలేదు..2019లో టిడిపికి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు వైసీపీకి అధికంగానే వచ్చాయి. చంద్రబాబు కసితో పని చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తారు జగన్ ఓటమికి కారణం కక్ష రాజకీయాలు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: