ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎన్నికలు ముగిసిపోయి  కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడింది. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేశారు. అలాగే ఆయన కేబినెట్ లో 24 మంది మంత్రులను ఎంపిక చేసుకున్నారు. ఇందులో సామాజిక,ఆర్థిక, కుల  గణన ఆధారంగా  మంత్రుల శాఖలను కేటాయించారు. ముఖ్యంగా జనసేన పార్టీకి కూడా మంత్రి పదవులు అందించారు.

అయితే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి శాఖ ఇస్తారు అని మనం ఇన్నాళ్లు ఎదురు చూసాం. చాలామంది హోం శాఖ ఇస్తారని అనుకున్నారు. కానీ చివరి టైం వచ్చేసరికి ఆయనకిచ్చిన శాఖలు చూసి సోషల్ మీడియాలో విపరీతంగా పంచులు పేలుస్తున్నారు. ఈ శాఖల కోసమే పవన్ కళ్యాణ్ ఇంత హడావిడి చేశారా  అంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకుంటున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలవడం కోసం  పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేశారు.  

అసలు పవన్ వల్లే చంద్రబాబుకు అంతటి విజయం సాధ్యమైందని తప్పనిసరిగా చెప్పవచ్చు.  అలాంటి పవన్ కళ్యాణ్ కి సీఎం పదవి ఇచ్చినా తక్కువ కాదు అనేది పవన్ మరియు రాష్ట్రంలోని నాయకుల వాదన. అలాంటి పవన్ కు హోం శాఖ డిప్యూటీ సీఎం లాంటి శాఖలన్నీ ఆయన హ్యాండోవర్ లో ఉంటాయని అనుకున్నారు.కానీ చివరకు పవన్ కళ్యాణ్ కు  డిప్యూటీ సీఎం తో పాటు  పంచాయతీ,గ్రామీణ అభివృద్ధి శాఖలు మాత్రమే అప్పజెప్పారు.

దీంతో జనసేన సైనికులు మరియు కొంతమంది పవన్ అభిమానులు  ఈ మాత్రం శాఖలు ఇవ్వడానికి ఇంత హడావిడి అవసరమా చంద్రబాబు అంటూ ఖండిస్తున్నారు.  ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావాలనే జనసేన నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఎదిగితే తనకే ప్రాబ్లం అవుతుందనే ఆలోచనతో ఇలాంటి  శాఖలు ఇచ్చారని అంటున్నారు. అంతేకాకుండా తన కొడుకును హైలైట్ చేయడం కోసం పవన్ ను  తక్కువ చేశారంటూ కూడా మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: