కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. మంత్రి పదవులిచ్చి మిత్రపక్షాలలో ఎలాంటి అసంతృప్తులు లేకుండా బీజేపీ జాగ్రత్తపడింది. కానీ లోక్ సభ స్పీకర్ పదవిపై మాత్రం ఇంకా సస్పెన్స్ అనేది అలాగే కొనసాగుతుంది.ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమకు స్పీకర్ పదవి కేటాయించాలని ఎంతగానో పట్టుబట్టింది. ఇక తామేం తక్కువకాదన్నట్టు జేడీయూ కూడా ఆ స్పీకర్ పదవిపై కన్నేయడం జరిగింది. బీజేపీకి తలనొప్పులు తప్పవు అనుకునే సమయానికి జేడీయూ స్పీకర్ రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే అందుకు కారణం జేడీయూ స్పోక్స్ పర్సన్ కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలే. జూన్ 26 వ తేదీన జరగనున్న స్పీకర్ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసిన వ్యక్తికి తాము మద్దతు ఇస్తామని కేసీ త్యాగి చెప్పారు. దీంతో స్పీకర్ రేసు నుంచి జేడీయూ అవుట్ అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఇక లోక్‌సభ స్పీకర్‌పై జేడీయూ అధికార ప్రతినిధి అయిన కేసీ త్యాగి మాట్లాడుతూ.. “టీడీపీ, జేడీయూ అనేవి ఎన్డీఏతో ఉన్నాయి. బీజేపీ నామినేట్ చేసిన వాళ్ళకి మద్దతిస్తాం..'' అని అన్నారు.


 ఓ ఇంటర్వూలో స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి కట్టబెడతారా అనే ప్రశ్నకు కూడా త్యాగి జవాబివ్వడం జరిగింది. స్పీకర్ పదవి ఎప్పుడూ కూడా పాలక పక్షానిదేనని.. వారికి ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి వారికి ఇవ్వడమే కరెక్ట్ అని త్యాగి అన్నారు.ఇదిలా ఉండగా టీడీపీ మాత్రం స్పీకర్ పదవిపై పట్టువిడవడం లేదని సమాచారం తెలుస్తోంది. కేంద్రంలో చక్రం తిప్పాలంటే స్పీకర్ పదవి ఖచ్చితంగా చాలా కీలకం మని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం బాబుకి తెలిసినట్లుగా ఎవరికి కూడా తెలియదు. అందుకు ఉదాహరణ ఏంటంటే 1999 కేంద్రంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ఓటింగ్.. అప్పటి ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి టీడీపీ స్పీకర్ జీఎంసీ బాలయోగీ తీసుకున్న నిర్ణయమేనంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దీంతో బీజేపీ ప్రస్తుతం స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు సాహసం చేయడంలేదని చర్చ బాగా నడుస్తోంది. దీంతో స్పీకర్ పోరులో టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ తప్పదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇక జూన్ 26 వ తేదీన లోక్‌సభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనుంది. 18వ లోక్‌సభ సమావేశాలు జూన్ 24 వ తేదీన తొలిసారిగా ప్రారంభమయ్యి జూలై 3న ముగుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: