ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు 24 మంది ఎమ్మెల్యే లకు మంత్రి పదవులు ఖరారు అయ్యారు.ఏపీలో సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి అధికారులతో సమావేశామయ్యారు.శుక్రవారం జరిగిన ఆలిండియా సర్వీసెస్ అధికారుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత 5 సంవత్సరాలు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పని చేసిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా లోతైన వ్యాఖ్యలు చేశారు.అయితే సీఎం చేసిన వ్యాఖ్యలపై అధికారులు ఒక్కసారిగా ఒలిక్కిపడ్డారు.గత వైసీపీ ప్రభుత్వానికి సలాం కొట్టిన అధికారులందరి పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంసంగా మారింది.గత ప్రభుత్వం తో కలిసి 'రాష్ట్రాన్ని నాశనం చేశారు వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పి పోయాయి.ఉన్నత స్థానాల్లో ఉన్న మీరు అనేక  తప్పులు చేశారు' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల మొహం పైనే కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. 'నా బాధ నా కోసం కాదు దెబ్బతిన్న రాష్ట్రం కోసం' అంటూ అధికారుల వైపు చూసి స్ట్రాంగ్ గా హెచ్చరించారు. తన పాలన లో ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన, ప్రోత్సహించిన అధికారులు సైతం జగన్ కోసం పనిచేయడంఆయన చేసిన కుట్ర లో భాగస్వామ్యం అవ్వడం, నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.సీఎం మొదటి మీటింగ్‌లో ఇలాంటి హాట్ కామెంట్స్ గట్టిగ చేయడంతో అధికారుల్లో అలజడి మొదలైంది. అధికారుల విషయంలో చంద్రబాబు అభిప్రాయానికి పార్టీలో, సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కూటమి ఫాన్స్. కాగా, రాష్ట్రం లోని అన్ని విభాగాల్లో సమూల ప్రక్షాళన చేయాలనే గట్టి ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు కనబడుతుంది.చంద్రబాబుకు ఉన్న ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: